Home రాజకీయాలు తెదేపా ఎంపీ టీజీ చెత్త వాగుడు!

తెదేపా ఎంపీ టీజీ చెత్త వాగుడు!

79
SHARE

టిడిపి ఎమ్.పి టిజి వెంకటేష్ సడన్ గా తన ఉనికి చాటుకోటానికి అన్నట్లు అవసరమున్న లేకున్నా అప్పుడప్పుడు మాట్లాడుతూ వుంటారు.

తాజా ఏ పని లేనట్లు ఉన్నారేమో కొత్త సమస్యలను సృష్టి౦చాలని అభ్యంతరకర పదజాలం వాడారు. ఆంద్ర,తెలంగాణ మధ్య తగాదాలు పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ఎమ్.పి. కె కేశవరావును ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలం వాడారు. తన ఒంట్లో ప్రవహించేది పౌరుషంతో కూడిన సీమనెత్తురట, కానీ కేకే ఒంట్లో సారా నిండి ఉంటుందని అన్నారు. ఇంకా లోకేష్ వద్దకు కెశవరావు రావాలని టీజీ చెప్పారు.

ఆయన మాటల్లో: ఉద్యమం పేరుతో వేలమంది పిల్లల్ని బలి చేశారు. ఇప్పుడు అధికారం అనుభవిస్తోన్న కేకే లాంటి చాలా మంది నాయకులు అసలు ఉద్యమంలోనే పాల్గొనలేదు. కనీసం కాలిగోటికైనా బుల్లెట్‌ తగిలి ఉండదు. వీళ్లందరికీ ఒకటే పని.. రాత్రైతే కేసీఆర్‌ కాళ్లు పిసకడం, మందుతాగడం తప్ప ఇంకోటి చేయరు. అసలిదంతా టీజీ తెరాస నాయకులని తెలంగాణ ముఖ్యమంత్రి ని ఏ ప్ కి స్పెషల్ స్టేటస్ కి సపోర్ట్ గా ఉండమని అడగటం వాళ్ళ వచ్చిన చిక్కు. కెసిఆర్ స్పెషల్ స్టేటస్ కి సపోర్ట్ చేయకపోతే తెలంగాణ లో వున్నా సీమాంధ్ర వాళ్ళెవరూ తెరాస కి వోట్ వెయ్యరని టీజీ అనటం తో స్టార్ట్ అయ్యింది.

ఉద్యమం గురించి మాట్లాడి టీజీ తప్పు చేశారు. తెదేపా ఎంపీ సంచలన వ్యాఖ్యలు తెరాస లో ప్రకంపనలు సృష్టిస్తాయనటంలో సందేహం లేదు.