Home రాజకీయాలు ఆనంపై మొదలుపెట్టేసిన బాబు!

ఆనంపై మొదలుపెట్టేసిన బాబు!

SHARE

చంద్రబాబు రాజకీయాల గురించి తెలిసే చేరారో లేక నాటి పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ… కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాపితం అవుతుందని గ్రహించిన ఆనం సోదరులు.. సైకిల్ ఎక్కేశారు. నాలుగేళ్లు అంతా బాగా సాగినట్లే అనిపిస్తున్నా… తాము మొదటినుంచి కూడా అసంతృప్తిగానే ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు ఆనం. అనంతరం తాజాగా జరిగిన టీడీపీ మహానాడులో.. తమ అసంతృప్తిని, ఆవేదనను బహిరంగంగానే వెళ్లగగ్గారు. నాటి నుంచి ఆనం సోదరులు సైకిల్ దిగిపోతున్నారని ప్రచారం జరిగింది. అనుకున్న సమయం రానే వచ్చింది.. అగౌరవాలు, అవమానాలు అని ఆనం సైకిల్ దిగిపోయారు. దాంతో మొదలైంది బాబు గారి బురదజల్లే కార్యక్రమం!

తాను తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్నానని, అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు నెల్లూరుకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. నెల్లూరు టీడీపీ నేతలను కలిసిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందట. ఈ విషయాలపై స్పందించిన బాబు… తనకు పార్టీలో గౌరవం లభించడం లేదని, అందువల్ల పార్టీని వీడుతున్నట్లు ఆనం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని.. కేవలం పదవులు ఇవ్వలేని కారణంగానే.. పార్టీ మారుతున్నారని చెప్పుకొచ్చారు. “ఆనం రామనారాయణ రెడ్డిని ఇక్కడ ఏం అగౌరవపర్చాం? ఆయన ఎందుకు అలా అనుకుంటున్నారు? ఆనంకు తాను గౌరవం ఇవ్వనిదెప్పుడు?” అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

దానికి కారనంగా బాబు చెప్పిన మాట… ముందుగా ఆనం రామనారాయణ రెడ్డి తనను ఎమ్మెల్సీ ఇవ్వమని అడిగారని, ఆ పదవి ఇచ్చేలోపు వివేకా కూడా ఎమ్మెల్సీ అడిగారని.. ఇద్దరికీ ఇవ్వలేని పక్షంలో తాను ఎవరికీ ఇవ్వలేదని చెప్పుకొచ్చారట బాబు! అన్నదమ్ముల మధ్య పుల్ల పెట్టడంగా ఈ అంశాన్ని భావించిన వారు.. ఇది బాబు రాజనీతికి నిదర్శనమని చెబుతున్నారు. నిజంగా చంద్రబాబుకు.. ఆనం సోదరులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అనుకుంటే… ఇద్దరినీ పిలిపించి, ఒకరికి మాత్రమే ఇవ్వగలని చెప్పి.. వారు ఒప్పుకున్న పక్షంలో ఒకరికి ఇవ్వొచ్చు. అలా కాని పక్షంలో.. ఈ విషయం ప్రజలకు తెలపొచ్చు. అంతే కానీ.. పార్టీ మారిపోయిన అనంతరం… ఇద్దరికీ కావాలని అన్నారు, ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు ఎలా ఇవ్వాలని ఇవ్వలేదు అని బాబు చెప్పడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాబు తలచుకోవాలే కానీ… ఇలాంటివి కోకళ్లలు అని చెబుతున్నారు పలువురు!