Home రాజకీయాలు పరకాల – బాబు.. మామూలు డ్రామా కాదు!

పరకాల – బాబు.. మామూలు డ్రామా కాదు!

SHARE

ఎవరూ ఏమాత్రం తగ్గడం లేదు.. ఫెర్మార్మెన్స్ లో ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు.. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు, బాబు సావాసంలో నడుస్తున్న అధికారులు.. ఎవరికి వారు పోటా పోటీగా ఫెర్మార్మ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు వంటి అద్భుతమైన అనుభవం ఉన్న మేధావి సావాసమో లేక ఒరిజినల్ కూడా అంతేనో తెలియదు కానీ… రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్.. గురువుకు తగ్గ శిష్యుడిగా, చంద్రబాబును మించిన మేధావిగా మారారు అన్న కామెంట్స్ తాజాగా వినిపిస్తున్నాయి. దానికి కారణం.. రాజినామా పేరు చెప్పి “పరకాల – బాబు” ద్వయం కనబరిచిన కళా ప్రతిభ!!

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పరకాల పదవీకాలం 2016 జూలై లోనే ముగియాల్సి ఉన్నా… మరో రెండేళ్ల పదవీ కాలానికి పొడిగింపు లభించడంతో.. అది కాస్తా జూలై 4 – 2018 నాటికి పూర్తి కానుంది. అంటే… మరో రెండు వారాల్లో పరకాల పదవీ విరమణ చేయాలి. దీంతో… పరకాలతో రాజీనామా చేయించి తమకు చాలా పౌరుషం అని.. ఎవరైనా మాటంటే పడలేమని బిల్డప్ ఇప్పించి మైలేజి కొట్టేద్దామని చూశారు చంద్రబాబు! అనుకున్నదే తడవుగా… పరకాలతో రాజినామా చేయించారు. ఈ క్రమంలో… మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించడం.. దాంతోపాటు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ఏపీ ప్రభుత్వ పదవిలో ఎలా కొనసాగుతారని జగన్ సంధించిన ప్రశ్నలకు తలపట్టుకున్న చంద్రబాబు… ఆ వ్యాఖ్యలకు స్పందించినట్టు బిల్డప్ ఇస్తూ పరకాల ప్రభాకర్ రాజీనామా పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పరకాల సైతం… జగన్ ఆరోపణలు చేయడంతోనే తాను తన పదవిని త్యజించేస్తున్నానని, చంద్రబాబు చేస్తున పోరాటానికి తాను ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కానీ ఇబ్బంది కలిగించేవాడిని కాదలచుకులేదని అబ్బో… మామూలు ఫెర్మార్మెన్స్ చేయలేదు పరకాల తన లేఖతో! ఈ రకంగా అయినా బీజేపీ – టీడీపీ చీకటి ఒప్పందాన్ని కప్పిబుచ్చాలనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్! అయితే తాజాగా పరకాల అపాయింట్ మెంట్ లెటర్ బయటకు రావడంతో బాబు గారి “పరకాల రాజినామా” బాగోతం బట్టబయలైంది.

ఏదిఏమైనా… మరో 15 రోజుల్లో తన పదవీ కాలం ముగియనుందని తెలిసిన ప్రభాకర్… రాజీనామా డ్రామాతో ఏపీ ప్రజలను మభ్యపెట్టాలని చూసిన వైనం తెలుసుకొన్నవారు మాత్రం నోళ్లు వెళ్లబెడుతున్నారంటే అతిశయోక్తి కాదు.