Home రాజకీయాలు కడప ఉక్కు సాధనకు ఎపి బంద్: వైకాపా పిలుపు

కడప ఉక్కు సాధనకు ఎపి బంద్: వైకాపా పిలుపు

SHARE

కడప ఉక్కు ఆంద్రుల హక్కు అనే నినాదంతో ఎపి బంద్ కు పిలుపు ఇస్తున్నట్లు ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో చెప్పారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 23న కడప, 24న బద్వేల్‌, 25న రాజంపేటల్లో వైకాపా ధర్నాలు చేపడుతుందని తెలియ చేశారు. అంతే కాక 26న జమ్మలమడుగులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 27న రహదారుల దిగ్భంధం, అలానే 29న రాష్ట్ర బంద్‌ చేపడతామని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో బీజేపీ-టీడీపీ పార్టీలు కనీసం ఉక్కు ఫ్యాక్టరీ ఊసేత్తలేదని ఆయన గుర్తుచేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి దీక్ష ముగింపు సభలో ఆయన మాట్లాడారు.

మరోపక్క అధికార తెలుగుదేశం ఎంపీ సి ఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష పై బీజేపీ ఎంఎల్ సీ సోము వీర్రాజు కడప స్టీల్ ప్లాంట్ కేంద్రం బాధ్యత ఎవ్వరూ ఒక్క రక్తపు బిందువు కానీ, చెమట చుక్క గాని వేస్ట్ చెయ్యక్కరలేదు అంటూ తెలిపారు!!