Home రాజకీయాలు వైసీపీ తెదేపా జోడి: కన్నా తమాషా కామెంట్

వైసీపీ తెదేపా జోడి: కన్నా తమాషా కామెంట్

SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ తమాషా ఆరోపణ చేశారు. ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తో కలిసి తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు తమపై ఆరోపణలు చేయడం ఏమిట౦టూ ఆయన ప్రశ్నించారు.

బాబు తీరు దొంగే..దొంగ అని అరిచిన చందాన ఉందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీ లకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని చంద్రబాబు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని కన్నా విమర్శించారు.

ఆంధ్ర కు ఇంతవరకు కేంద్రం 1.26 లక్షల కోట్ల నిదులు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే చంద్రబాబు అవినీతి మయం చేశాడని, జన్మబూమి మొదలు, మరుగుదొడ్ల నిర్మాణం వరకు అంతా అవినీతే మయమైందని ఆయన అన్నారు. ప్రత్యేక ప్యాకేజీనే బెటర్ అ౦టూ ప్రచారం చేసింది చంద్రబాబేనని కూడా కన్నా గుర్తు చేశారు.

బాబుని విమర్శించడం ఓకే, వైకాపాతో తెదేపాకి సంకీర్ణం ఏమిటి సామి?