Home రాజకీయాలు బుగ్గన పై చర్యాలా? ఎంత అరాచకం?

బుగ్గన పై చర్యాలా? ఎంత అరాచకం?

SHARE

పీఏసీ చైర్మన్ గా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తూ తెదేపా ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదుకు ఫిర్యాదు చేశారు.

తెదేపా నాయకుడు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాజేంద్రనాథ్ రెడ్డిపై స్పీకర్ చర్యలు తీసుకునే దాకా తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో రాంమాధవ్ నివాసానికి వెళ్లిన విషయం లాగ్ బుక్ లో స్పష్టంగా రాసిఉందని, భాజపా ఎమెల్సీ ఆకుల సత్యనారాయణ, వైకాపా ఎంఎల్ ఏ బుగ్గన ఇద్దరూ కారులో ప్రయాణించిన విషయం సంబంధిత విజువల్స్ లో అందరూ చూసారని అన్నారు.

ఇంకా ఈ సమాచారాన్ని వెల్లడించిన డ్రైవర్ తమ పార్టీ కార్యకర్త కాదని, ప్రభుత్వ ఉద్యోగి అనే విషయం గుర్తుంచుకోవాలని కూడా అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన బుగ్గన వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామని, సభను స్తంభింపజేస్తామని చెప్పారు. ఈ కారణంగానే బుగ్గనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చామని చెప్పారు.

ఇక ఏపీ భవన్ లాగ్ బుక్ ను ట్యాంపరింగ్ చేసామ్ అ౦టూ వస్తున్న ఆరోపణలు సత్య దూరమని ఎస్ వీ మోహన్ రెడ్డి అన్నారు. స్వయంగా రామ్ మాధవ్ తనని బుగ్గన కలవలేదని చెప్పినా వినరా? ఎంతగా వైకాపా ఎంఎల్ ఏ లను టార్చర్ పెడుతుంది అరాచక ప్రభుత్వం?