Home రాజకీయాలు బాబు సరి కొత్త ప్రామిస్: రజకులను ఎస్సీల్లో చేరుస్తాం

బాబు సరి కొత్త ప్రామిస్: రజకులను ఎస్సీల్లో చేరుస్తాం

266
SHARE

కాపులకు రిజర్వేషన్ లు అంటూ వారిని ఓ ఆట ఆదుకున్న ఏ పీ సిఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రజకుల షాకింగ్ వార్త చెప్పారు. రజకులను ఎస్సీల్లో చేరుస్తామన్నారు చంద్రబాబు.

అదేసమయంలో ఎస్సీలకు అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆదాయం లభించేలా చేస్తామంటూ హామీ ఇచ్చారు. విశాఖపట్టణంలో బహిరంగ సభ సాక్షిగా బాబు రాష్ట్ర ప్రజల పై అనేక వరాలు కురిపించారు. డ్వాక్రా మహిళలకు రూ.2 వేలు చొప్పున పింఛన్ ఇవ్వాల్సి ఉందని అన్నారు….అలానే విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని త్వరలోనే హెల్త్ సిటీని కూడా పూర్తి చేస్తామన్నారు.

విశాఖలో పదహారు వందల ఎకరాల్లో క్రీడా నగరాన్ని ఒకటి నిర్మిస్తామని బాబు తెలిపారు. ఇంకా గిరిజన ప్రాంతాల్లో రూ.1250 కోట్లతో రహదారులు నిర్మిస్తామని కూడా అన్నారు. రాష్ట్రంలో భూముల ఆక్రమణలకు అవకాశం ఉండకుండా సరికొత్త విధానంతో ముందుకు వెళ్తామని ఆన్నారు.

సీఎం మూడో విడత క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూముల పరిరక్షణకు ఆధార్‌ మాదిరిగా భూదార్‌ తీసుకొస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌ లోనే భూముల వివరాలు చూసుకోవచ్చంటూ చెప్పారు.

ఇప్పటికే కాపు కులం వారిని కొన్ని బీసీ కులాల వారిని, ఎస్సీ లు, బ్రాహ్మణుల కులాల వారిని తెదేపా దూరం చేసుకుంది, బాబు పరిపాలనలో ఈ కులాలవారికి ఏ మాత్రం నమ్మకం లేదు. ఇక ఇప్పుడు రజకులను కూడా ఇదే జాబితాలో టీడీపీ చేర్చుకుంది. ఎస్సీలకు అన్యాయం జరగకుండా రజకులను ఎలా ఎస్సీలలో చేర్చగలదు అనేది సమాధానం తెలిసిన డౌట్!!