Home సినిమా జంబలకిడి పంబలో ప్రత్యేకత : శ్రీనివాసరెడ్డి

జంబలకిడి పంబలో ప్రత్యేకత : శ్రీనివాసరెడ్డి

SHARE

జయమ్ము నిశ్చయంబు రా, ఆనందో బ్రహ్మ చిత్రాలు సాధించిన విజయాల తర్వాత హీరోగా ప్రస్తుతం జంబలకిడి పంబలో నటిస్తున్నాను. ‘జంబలకిడి పంబ చిత్రానికి కథే హీరో. చాలా బాగుంటుంది ఈ సినిమాలో కూడా దర్శకుడు చెప్పిన స్టోరి కారణంగానే ఈ చిత్రంలో నటించాను. అమ్మాయి ఆత్మ అబ్బాయిలోకి,  అబ్బాయి ఆత్మ అమ్మాయిలోకి ప్రవేశించడం ఇందులో ప్రత్యేకత.

అమ్మాయిలాగా చేయడానికి  ప్రత్యేకించి హోమ్‌వర్క్‌ చేయలేదు. చిరంజీవిగారి ‘చంటబ్బాయి’, నరేశ్‌గారి, రాజేంద్రప్రసాద్‌గారి  సినిమాలు చూశా. ఇంట్లో కూడా కాసేపు మా ఆవిడ నైటీ వేసుకుని ఎలా ఉంటుందో చూశా’’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన హీరోగా, సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి. ఎన్‌ నిర్మించిన ‘జంబలకిడి పంబ’ రేపు విడుదలవుతోంది.