Home రాజకీయాలు చంద్రబాబు తోడల్లుడు జగన్ ని మెచ్చుకోవటం మంచిదే

చంద్రబాబు తోడల్లుడు జగన్ ని మెచ్చుకోవటం మంచిదే

SHARE

ప్రతిపక్ష నేత వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ గురించి చంద్రబాబు తోడల్లుడు మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గొప్పగా చెప్పారు. జగన్ గ్రాఫ్ పెరుగుతోందని మాజీ బాపట్ల ఎంపీ అన్నారు. పురందరేశ్వరి భర్త అయిన వెంకటేశ్వర రాప్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ పాదయాత్రతో వైఎస్ జగన్ గ్రాఫ్ బాగా పెరుగుతోందని అభిప్రాయపడ్డారు.

పోలవరం, పులిచింతల వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు వైఎస్ రాజేశేఖరరెడ్డి హయాములోనే ముందుకు వచ్చాయని దగ్గుబాటి స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిదులు ఇవ్వడం లేదని చెబుతున్న అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరి ఆ ప్రాజెక్టును నిధులివ్వట్లేదనే వంకతో కేంద్రానికి విడిచిపెట్టొచ్చు కదా అన్నారు.ఎందుకా నిధుల్లేని ప్రాజెక్ట్ పట్టుకు వెళ్లాడటం అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలు చాలా డబ్బు మయం అయిపోయాయని, ఓట్లకు నోట్లు ఇచ్చే సంస్కృతి విపరీతంగా పెరిగిందని, అందుకే తానూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా చెప్పారు.