Home రాజకీయాలు రమణ దీక్షితులు చెప్పేవి అసత్యాలైతే ఎ౦క్వయిరీ వేయొచ్చుగా?

రమణ దీక్షితులు చెప్పేవి అసత్యాలైతే ఎ౦క్వయిరీ వేయొచ్చుగా?

160
SHARE

టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేస్తోంది ఆరోపణలు కాదు అవి అసత్యాలని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు.

మీడియాతో మాట్లాడుతూ తెదేపా ఎమ్మెల్యే ఇప్పటివరకూ రమణ దీక్షితులు పదే పదే చెప్పినవన్నీ కూడా అసత్యాలే అని, ఆయన శ్రీ వేంకటేశ్వరుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరవై ఐదేళ్ల పాటు అతిపెద్ద ఆలయానికి ప్రధాన అర్చకుడి పదవిలో ఉన్న రమణ దీక్షితులు అసత్యాలు చెబుతున్నారని, తిరుమల వ్యవహారంపై, శ్రీవారి నగలు సంబంధించి అనేక అంశాలపై ఆయన స్వయంగా రాసిచ్చిన లేఖలు సంబంధిత కమిటీల వద్ద, టీటీడీ వద్ద ఉన్నాయని, వీటన్నింటినీ న్యాయస్థానం ఎదుట ఉంచుతామని బోండా ఉమా చెప్పారు.

ఆయన చెప్పిన అసత్యాలపై ఆయనే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని ఉమా పేర్కొన్నారు. రమణదీక్షితులు ప్రభుత్వం పై దీక్షకు దిగుతానని చెప్పడం గురించి బోండా ఉమ స్పందిస్తూ, దీక్ష వలన అవాస్తవాలు వాస్తవాలు కావని, దీక్షలు ద్వారా ఎవ్వర్నీ మభ్య పెట్టలేరని నమ్మించలేరని చెప్పారు. బాలాజీ భక్తులకు ఇప్పటికే వాస్తవాలు తెలిసిపోయాయని, దీక్షలు చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా అవాస్తవాలను వాస్తవాలుగా రమణ దీక్షితులు చిత్రీకరించలేరని స్పష్టం చేశారు. ఆయన దీక్ష కంటే ముందు టీటీడీ ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనీ, లేదంటే కోర్టులో ఎదుర్కోవాలని అన్నారు.

వాస్తవాలో అవాస్తవాలో తేల్చటానికి సీబీఐ ఎ౦క్వయిరీ వేస్తే సరిపోదూ? దానికి భయమెందుకు బోండా సర్?