Home రాజకీయాలు పార్ట్-టైమర్ అనే బిరుదు పవన్ సార్ధకం చేసుకుంటున్నాడా??

పార్ట్-టైమర్ అనే బిరుదు పవన్ సార్ధకం చేసుకుంటున్నాడా??

SHARE

జన సేన అధినేత తీరు గమ్మత్తుగా ఉంటుంది. ఓ మెరుపు లా వస్తాడు, అంతే మెరుపులా మాయమౌతాడు. పవన్న జన సేన పోరాట యాత్ర అంటూ మొదలుపెట్టాడు. మొదటగా ఉత్తర ఆంధ్ర టూరు అంటూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం బస్సు లో యాత్ర గా టూర్ చేసాడు. ప్రజలని కలుస్తూ వాళ్ళ కషటాలు తెలుసుకుంటూ బాగా సాగుతున్న టూరు కి ఉన్నట్టుండి బ్రేక్ చెప్పాడు. ఈద్ పండగ అంటూ కారణం కూడా. ఇక ఈద్ పండగ అయి౦ది జన సేనాని ఎక్కడ అంటూ జన సైనికులు అడుగుతున్నారు…కానీ పవన్ ఆచూకీ లేదు.

ఓ పక్క ఎన్నికలకి ఎక్కువ సమయం లేదు. ఇంకో పక్క అయన ఆరోగ్యం గురించి రూమర్లు….చూపు ఇంకా వెన్ను నొప్పులు అని రూమర్లు.

ఇంకా క్యాడర్లు బిల్డ్ చేయాలి, బూత్ కాన్వెంర్లను నియమించాలి, పార్టీ కి సంబంధించి ఎన్నో పనులు పెండింగ్ లో వున్నాయి, మరో పక్క రాష్ట్రమంతా టూర్ చేయాలి…ఇలా బ్రేక్ లే ఎక్కువైతే…రాజకీయాలేలా చేస్తాడో అని అభిమానులే వర్రీ అవుతున్నారు.