Home రాజకీయాలు బీ కేర్ ఫుల్ అని నాయుడు అంటే, భరోసా ఇదిగో అని జగన్!

బీ కేర్ ఫుల్ అని నాయుడు అంటే, భరోసా ఇదిగో అని జగన్!

260
SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయీ బ్రాహ్మణులను అవమాన పరచటం దేశం మొత్తం తెలిసింది. కనీస వేతనాలు కోసం స్ట్రైక్ చేస్తున్న వారిపై స౦యమన౦ కోల్పోయి ప్రవర్తించిన తీరు అందరి ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే నాయీ బ్రాహ్మణులకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ భరోసా ఇచ్చారు. వారికి కనీస వేతనాలు ఇవ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చట్ట విరుద్దమని చెప్తూ తమ పార్టీ అదికారంలోకి వస్తే కనీస వేతనం ఇస్తామని ప్రకటించారు. అ౦తేకాకుండా ఆలయ బోర్డులలో వారికి కూడా సభ్యత్వం కల్పించడం చేస్తామని జగన్ ప్రకటించారు.

నాయీ బ్రాహ్మణుల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తామని ట్వీట్ చేశారు. నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో చెప్తూ అలాంటి వారి కష్టాలు వినే పరిస్థితి లేకపోవటం ఏపీ చేసుకున్న దురదృష్టం అన్నారు. వారిని చంద్రబాబు అవమానించడం, బెదిరించడం దారుణ౦ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ట్వీట్ ఆలోచన రేకెత్తించేదిగా వుంది.