Home రాజకీయాలు వైసీపీ ని అమిత్ షా నడిపిస్తున్నారట…!!

వైసీపీ ని అమిత్ షా నడిపిస్తున్నారట…!!

191
SHARE

ఢిల్లీలో నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు కరచాలనం చేయడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తెదేపా తిప్పికోట్టింది.

ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానితో చేయి కలిపితేనే వంకర మాటలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. వైకాపా నీచమైన రాజకీయాలు చేస్తు౦దని మండిపడ్డారు. అసలు వైసీపీని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నడిపిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ని అమిత్ షా నడిపిస్తున్నారట…ఇంకా నయం ప్రజా సంకల్ప యాత్ర కూడా భాజపా వేసిన స్కెచ్ ఏ అనలేదు!!

ఇలా ఉంటే టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ, నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు కేంద్రం తీరును ఎండగట్టారని అన్నారు. చంద్రబాబు ప్రసంగం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతుకూడ దక్కేలా చేసిందని చెప్పారు. సభ్యత, సంస్కారం, విజ్ఞత లేని వ్యక్తి జీవీఎల్ నరసింహారావు అ౦టూ మండిపడ్డారు. ప్రధాని పలకరింపునకు సంస్కారంగా మాత్రమే చంద్రబాబు వ్యవహరించారని అన్నారు.

తాము చేస్తే సంసారమూ ఎదుటివారు చేస్తే వ్యభిచారమా….ఏ ఆధారంతో వైకాపా భాజపాకి మాద్దతు ఇస్తుందో తెదేపా వారు సెలవిస్తే బావుణ్ణు!