Home రాజకీయాలు నీతి ఆయోగ్ సమావేశంలో బాబు ప్రసంగం విన్న ఎవరైనా హోదా ఇస్తారా??

నీతి ఆయోగ్ సమావేశంలో బాబు ప్రసంగం విన్న ఎవరైనా హోదా ఇస్తారా??

410
SHARE

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ టూర్ గురించి పార్టీ ప్రో మీడియా లో చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు…..తీరా చూస్తే ఏ౦ జరిగింది అ౦టూ విపక్ష నేత జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రదాని మోడీని కడిగేస్తారని, యుద్దం ప్రకటిస్తారని అది ఇదనీ చెప్పి౦ది మీడియా….కానీ ముఖ్యమంత్రి గారు ఉత్తరకుమారుడు లా తిరిగొచ్చారని జగన్అ న్నారు.

కౌరవుల మీద యుద్దానికి వెళుతున్నానని, శత్రువుల తలపాగాలు తీసుకు వస్తానని డప్పా కొట్టి తర్వాత ఉత్తరకుమారుడు సైన్యాన్ని చూసి బెంబేలెత్తిపోయి రధాన్ని విడిచి పారిపోయినట్టే చంద్రబాబు గారి యుద్దం జరిగిందని….విపరీత ప్రచారం ఆఖరికి ఇలా అభాసుపాలయిందని జగన్ ఎద్దేవ చేశారు.

మోడీని చంద్రబాబు కడిగేస్తారని ప్రచారం చేసి మోడి తో షాక్ హ్యాండ్ కోసం బాబు ఎంత పాకులాడింది చూశామని జగన్ చెప్పారు. రాష్ట్రం లో ప్రత్యేక హోదా కోసం బిల్డప్ ఇస్తారు, కేంద్ర రక్షణమంత్రి నిర్మల సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ ను చంద్రబాబు పక్కన బెట్టుకుంటారని జగన్ అన్నారు.మరో వైపు బిజెపి మంత్రి బార్య కు టిటిడి బోర్డు మెంబెర్ గా పదవి ఇచ్చారని గుర్తుచేశారు. అలానే బాలకృష్ణ సినిమా షూటింగ్ కు వెంకయ్యనాయుడు గారు వస్తారని అన్నారు. చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటి అని విపక్ష నేత అన్నారు.

ఒకవేళ చంద్రబాబు తన ఎమ్.పి లతో రాజీనామాలు చేయించి ఉంటే వారితో ఆమరణ దీక్షకు తనూ కూర్చుని ఉంటే దేశం మొత్తం చూస్తుందని, హోదా వస్తుందని చెప్తే ఆ సలహా మాత్రం పాటించరని అన్నారు. రాజీనామా చేసిన వైకాపా ఎమ్.పిల గురించి చిల్లరగా కామెంట్లు చేయమని తనపార్టీ వారికి చెప్తారని జగన్ అన్నారు. అసలు నీతి ఆయోగ్ సమావేశంలో బాబు ప్రసంగం విన్న తర్వాత ఎవరైనా హోదా ఇస్తారా అని జగన్ ప్రశ్నించారు.