Home రాజకీయాలు ఆంధ్రజ్యోతికి కౌంటర్ ఇచ్చిన ఉండవల్లి!

ఆంధ్రజ్యోతికి కౌంటర్ ఇచ్చిన ఉండవల్లి!

780
SHARE

గత కొన్ని రోజులుగా టీడీపీ అనుకూల పత్రికగా ముద్రవేసుకుందనే పేరును సంపాదించుకున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక.. తాము లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీం తో కలిసి ఒక సర్వే నిర్వహించామని.. ఆ సర్వేలో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 110 సీట్లు వస్తాయని.. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తాడని చెబుతూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పచ్చి అబద్దమని, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని, ఇదంతా టీడీపీ – ఆంధ్రజ్యోతి ఆడుతున్న మైండ్ గేం అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి సర్వేకు కౌంటర్ ఇచ్చారు ఉండవల్లి అరుణ్ కుమారు.

ఆంధ్రజ్యోతి చెప్పిన సర్వే పూర్తి అబద్ధమని.. ఆ సర్వేకు పూర్తి విరుద్ధంగా ఫలితాలు వస్తాయని కుండబద్దలు కొట్టారు ఉండవల్లి అరుణ్ కుమార్. గతకొన్ని రోజులుగా చర్చ నడుస్తున్నట్లుగా.. ఒక వేళ ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ మోహన్ రెడ్డి కి అనుకూలంగా రాష్ట్రంలో గాలి వీస్తోందని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లిన ఆయనకు ప్రజల్లో అపూర్వ స్పందన వస్తోందని.. దీన్ని బట్టి వైసీపీ విజయం ఖాయమని స్పష్టమవుతుందని ఉండవల్లి చెబుతున్నారు.

జగన్ వ్యవహారశైలి, ప్రజల్లోకి వెళ్లిన తీరు, జగన్ తో కలిసి పాదం కలుపుతున్న ప్రజల పందన చూస్తుంటే.. ఖచ్చితంగా జగన్ గెలుస్తాడనిపిస్తోందని ఉండవల్లి చెప్పారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు చూస్తే జగన్ కు అనుకూలంగా ఉన్నాయని.. అయితే వైసీపీ కి మంచి టీం కావాలని.. ఈ వీక్ నెస్ ను జగన్ సరిదిద్దుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడని ఉండవల్లి అభిప్రాయపడ్డారురు. ఇదే స్మాయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా స్పందించిన ఉండవల్లి… పవన్ కూడా ఈ ఎన్నికల్లో తన ప్రతాపం చూపిస్తాడని, కాకపోతే పార్ట్ టైం పొలిటీషియన్ గానే పనిచేయడం కాకుండా.. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తేనే అతడి సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చని తెలిపారు!