Home రాజకీయాలు బీజేపీ నేతలదీ అదేమాట బాబు!

బీజేపీ నేతలదీ అదేమాట బాబు!

SHARE

నీతీఅయోగ్ సమావేఆనికి వెళ్లేముందు బాబు, ఆయన అనుకూల మీడియా చెప్పినట్లుగా అక్కడ ఏమీ జరగలేదని.. బాబు చెప్పేమాటలకు, చేసే పనులకు ఏమీ పొంతన లేదని విమర్శలు వెళ్లువెత్తాయి. ఈ విమర్శలు ప్రజలూ, ప్రతిపక్షాలూ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయాలపై బీజేపీ నేతలు కూడా బాబుని విమర్శించడం ఇక్కడ ఆసక్తికర విషయం. తమ అధినేత మోడీపై చంద్రబాబు చేసిన యుద్దం ఇదంటూ బీజేపీ నేతలు ఫోటోలతో కూడిన ట్వీట్లు పెడుతున్నారు. బాబు ఇంట్లో పులి.. వీదిలో పిల్లి అనే సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు.

నీతిఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో యుద్ధ వైఖరి అనుసరించారంటూ టీడీపీ, ఆయన అనుకూల మీడియా చేసిన ప్రచారంపై తాజాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఈ సందర్భంగా… నీతి ఆయోగ్ సమావేశం గురించి మీడియాలో టీడీపీ అసత్యాలు ప్రచారం చేసిందని, సమావేశంలో ప్రతి ముఖ్యమంత్రి కోసం కేటాయించిన సమయం 7 నిమిషాలు అయితే చంద్రబాబుకు మాత్రం 12 నిమిషాలు ఇచ్చారని.. ఈ సమయంలో చంద్రబాబు ఏమాత్రం ఘర్షణ విధానాన్ని అనుసరించలేదని.. ఇంట్లో పులి వీధిలో పిల్లి అంటే ఇదేనా..? అంటూ ఎద్దేవాచేస్తూ.. ప్రధాన మంత్రితో చంద్రబాబు నాయుడు నవ్వుతూ మాట్లాడుతున్న చిత్రాలను ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా తమ పార్టీ స్టాండ్ కరెక్టుగానే ఉందని, అయితే గతంలో చంద్రబాబే… ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతోనే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వస్తాయనే విషయం ఒప్పుకున్నారని, తమ అనుకూల పత్రికల్లో రాయించారని జీవీఎల్ గుర్తుచేస్తున్నారు. బీజేపీతో చెడిన అనంతరం ఆయన తీసుకున్న యూటర్న్ లను ప్రజలు గమనిస్తున్నారని.. కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ఏమీ పట్టనట్టు బాబు వ్యవహరిస్తున్నారని జీవీఎల్ అన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ టాపిక్ ఎత్తిన జీవీఎల్… స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయమంటే ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏది ఏమైనా… నీతీఅయోగ్ సమావేశంలో బాబు వ్యవహరించిన తీరును చూసిన ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజాసంఘాలు, మేధావులే కాదు.. ఆఖరికి బీజేపీ నేతలు కూడా విమర్శలు చేయడం చూస్తుంటే… బాబు ప్రజలను మరోసారి ఏ రేంజ్ లో మోసం చేశారో అర్ధం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!