Home రాజకీయాలు గంటాను ఆ విధంగా తప్పించి అవంతికా?

గంటాను ఆ విధంగా తప్పించి అవంతికా?

420
SHARE

గతకొన్ని రోజులుగా సర్వేల పేరు చెప్పి నానా హడావిడి చేస్తుంది టీడీపీ అనుకూల పత్రిక ఒకటి! రాబోయే ఎన్నికల్లో ప్రజలు మొత్తం చంద్రబాబు వైపే చూస్తున్నారని, బాబు పాలనకోసం మరోసారి వారంతా తపిస్తున్నారన్న రేంజ్ లో కథనాలు అచ్చేసేస్తుంది. “చదివేవాడు ఆంధ్రుడైతే.. రాసేది ఆంధ్రజ్యోతి” అన్నట్లుగా సాగుతున్న ఈ సర్వేల మైడ్ గేం లో.. అండర్ కరెంట్ గా కొన్ని విషయాలు చెప్పకనే చెబుతూ.. కార్యకర్తలకు హింట్ ఇస్తుంది ఆ పత్రిక! ఇంతకూ ఆ విషయం ఏమిటంటే… రాబోయే ఎన్నికల్లో ఎవరెవరికి బాబు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వరని ఇప్పటికే ఫిక్సయ్యారో, లేక.. రాబోయే ఎన్నికల్లో ఏ యే టీడీపీ నేత వైకాపా వైపు చూస్తున్నారని సంకేతాలు వస్తున్నాయో.. ఆ నేతను టార్గెట్ చేసి కథనాలు అచ్చేస్తుంది!

ఈ విషయంలో ఆ పత్రిక ముందునుంచీ గంటా శ్రీనివాస్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో గంటా, వైకాపా వైపు వెళ్తారని సదరు పత్రికకు ఏమైనా సంకేతాలు అందాయో.. లేక, గంటాకు స్థాన చలనం కల్గించాలని చంద్రబాబు సదరు పత్రికకు ఏమైనా లీకులిచ్చారో తెలియదు కానీ… అబ్బే.. భీమిలిలో గంటా పరిపాలన ఏమీ బాగాలేదు అని జనాలు చెప్పుకుంటున్నారని చెప్పుకొచ్చింది ఆ పచ్చ పత్రిక! 17 స్థానాల్లో అధ్యయనం చేసి, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 110 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్న ఈ పత్రిక… గంటా శ్రీనివాసరావు చాలా వెనుకబడ్డాడని, ఆయన మళ్లీ భీమిలిలో పోటీ చేసి గెలవలేడు అని సర్వేలో తేలిందని చెప్పుకొచ్చింది.

ఇక్కడే అసలు విషయం మరొకటి దాగుందని చెబుతున్నారు విశ్లేషకులు!! టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కు సంబందించి ఒక వార్త గత కొన్ని రోజులుగా మీడియాలో సైలంటుగా పాకుతూ పోతుంది. అదేమిటయ్యా అంటే… రాబోయే ఎన్నికల్లో తాను ఎంపీ కి పోటీ చేయనని, తనకు ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఉందని బాబు వద్ద విన్నవించారట అవంతి శ్రీనివాస్. ఈ విషయంపై కాస్త సానుకూలంగానే స్పందించిన బాబు… ఏ నియోజకవర్గం కావాలి అవంతి.. అని అడిగిన ప్రశ్నకు… భీమిలి నియోజకవర్గం అని అవంతి సమాధానం ఇచ్చారంట. ఈ క్రమంలో బాబు, అవంతికి మాటిచ్చారని.. దానికి అవసరమైన కారణాలు, సాకులు వెతికి.. గంటా శ్రీనివాస రావు టీడీపీలోనే కొనసాగితే.. వేరే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని బాబు ఫిక్సయ్యారని తెలుస్తుంది.

ఈ క్రమంలో గంటాకు ఏమి చెప్పి ఒప్పించాలో తెలియని చంద్రబాబు అండ్ కో… ఆంధ్రజ్యోతి సర్వేను సాకుగా చూపించి.. నియోజకవర్గాన్ని మార్చాలని, ఈ భీమిలి నియోజకవర్గాన్ని అవంతి శ్రీనివాస్ కు కట్టబెట్టాలని ఆలోచిస్తున్నారట. అంటే… ఆంధ్రజ్యోతి చేసిన సర్వే… ప్రజలనే కాదు, కొంతమంది టీడీపీ నేతలను సైతం ఏమార్చడానికి.. బాబుకు బలే ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!! బాబు మార్కు రాజకీయానికి ఆంధ్రజ్యోతి భజన ఇలా కూడా ఉపయోగపడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు!!