Home రాజకీయాలు యథా తండ్రి తథా తనయుడు….అబద్ధాల లోకేష్

యథా తండ్రి తథా తనయుడు….అబద్ధాల లోకేష్

139
SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, ఐటీ శాఖామాత్యులు నారా లోకేష్ తండ్రి బాటలోనే నడుస్తున్నట్టు ఉంది. అబద్దాలు చెప్పడమే కాక చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవట౦, తప్పు తనపై రాకుండా ఎదుటివారిపై బురద చల్లడమే లక్ష్య౦గా లోకేష్ రాజనీతి తయారైంది. ఇంకా నాలుగు పదుల వయసులేకుండా ఇంత నీచ రాజకీయాలను అలవర్చుకోటం పార్టీకి దురదృష్టకరమే.

సోషల్ మీడియా లో లోకేష్ ట్వీట్లు:
మీరు (ప్రజలు)వైసీపీ ఎంఎల్ఏ లను విశ్వాసంతో ఎన్నుకుంటే వారు మీకు గాని నియోజకవర్గానికి గాని ఏ౦ ఒరగబెట్టారు? సున్నా… వారేనాడు అసెంబ్లీ కి వచ్చింది లేదు, అభివృద్ధి కావాలనీ కోరుకోలేదు….కానీ జీత భత్యాలు మాత్రం టంచనుగా తీసుకున్నారు

కానీ మేము? మాకు అభివృద్ధే ఎజెండా ….ప్రతిపక్ష పార్టీ ఎంఎల్ ఏ లు నియోజకవర్గాలని వదిలేసినా మా ప్రభుత్వం ఆడకుండానే అన్ని చేస్తోంది…ఎవరికీ ఓటు వెయ్యాలో మీరే నిర్ణయించుకోండి…!

ఏంటి ఈ ఆరోపణలు లోకేష్? వైసిపి ఎంఎల్ఏ లకు నిధులు ఇవ్వకుండా ఎంత తిప్పలుపెడుతున్నారు…ఆ అవమానం కాక ఓడిపోయిన టిడిపి నేతలకు జిఓలు ఇచ్చి మరీ నిదులు ఇస్తున్న తెదీపా ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రతి రోజు నిలదీస్తూనే ఉంటే ఇలా ప్రచారం చేస్తారా…! ఇక పశువుల సంతలో కొన్నట్టు 23 వైకాపా ఎంఎల్ఏ లను కొనేశారన్న విషయం జ్ఞాపకం ఉందా? వాస్తవాలు తెలుసుకుని లోకేష్ మాటాడితే మర్యాద…లేకుంటే….ట్విట్టర్ లో ట్రోల్ల్స్ సమాధానం చెప్తారు!!