Home రాజకీయాలు జేసీ బాదేమిటో ఒకసారి చూడు బాబు!

జేసీ బాదేమిటో ఒకసారి చూడు బాబు!

139
SHARE

ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భజన చేయడమే పరవాధిగా పెట్టుకున్నారో లేక.. రాబోయే ఎన్నికల్లో అనంత జిల్లా మొత్తం పెత్తనం సంపాదించాలని, రాబోయే ఎన్నికల్లో తాను సెలక్ట్ చేసినవారికే ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇప్పుంచుకోవాలని బిస్కెట్లు వేస్తున్నారో తెలియదు కానీ… చంద్రబాబు పేరు చెబితే చాలు, భజన మీద భజన చేసేస్తున్నారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. బాబు పేరుచెబితే చాలు, అసలు భూమిపై ఉండకుండా, బాబుని ఆకాశానికెత్తేస్తున్నారు. వీరుడూ శ్రూరుడూ అంటూ చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో మరోసారి చంద్రబాబుపై పొగడ్తల వర్షాలు కురిపించారు.

చంద్రబాబు నాయుడు నాడు ప్రధాని పదవి వచ్చినా వదులుకున్నారని మరోసారి మొదలుపెట్టిన జేసీ దివాకర్ రెడ్డి.. కేవలం రాష్ట్రం కోసమే ఆ పదవిని వదిలేశారని చెప్పుకొచ్చారు. అంటే జేసీ దృష్టిలో… ప్రధాని పదవికంటే సీఎం పదవే పెద్దదని, ఆ పదవితోనే రాష్ట్రానికి ఎక్కువని భావించారని చెప్పబోత్న్నారన్నమాట. ప్రధానిపదవికి, ముఖ్యమంత్రి పదవి ఉన్న వ్యత్యాసం బాబుకు తెలియదనే విషయం చెప్పాలనుకుంటున్నారో ఏమో మరి జేసీకే తెలియాలి! అక్కడితో ఆగని జేసీ… ఇదే విషయాన్ని తాను మహానాడులో కూడా స్పష్టంగా చెప్పానని.. “ఇక్కడ ఎన్నాళ్లు ఉంటారు.. రాష్ట్రానికి సేవలు చేశారు.. అలాగే దేశానికి విస్తృత సేవలు అందించండి” అని తాను చంద్రబాబుకు చెప్పానని చెబుతున్నారు జేసీ.

అంతేనా… దేశంలో కీలక పదవిలో ఉంటే రాష్ట్ర అవసరాలను చిటికెన వేలుపై తీర్చేయ్యొచ్చని జేసీ, బాబుకు సూసించారట. కాబట్టి చంద్రబాబు కచ్చితంగా ఢిల్లీకి వెళ్లాలని, ప్రధాని అయితే ప్రధాని లేదంటే.. ఏదో ఒక కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకొస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండే కంటే.. దేశానికి ప్రధానిగా ఉంటే.. రాష్ట్రానికి ఇంకా ఎక్కువ సేవలు చేయొచ్చనే విషయం చంద్రబాబుకి గతంలో తెలియదని చెప్పడం అవివేకమని అనుకోవాలా, అజ్ఞానం అని అనుకోవాలో జేసీ నే చెప్పాలి.

ప్రతిసారీ ఇలా జేసీ చెప్పుకుంటూ వస్తున్న మాటలు విన్న జనం మాత్రం… ఆ జేసీ బాదేమిటో ఒకసారి చూడండి చంద్రబాబు… మీరు రాష్ట్రాన్ని లోకేష్ కు అప్పగించి, ఢిల్లీలో చక్రం తిప్పండి.. తద్వారా రాష్ట్రానికి ఏమి కావాలన్నా.. ఇంకెవరినీ బ్రతిమాలక్కర్లేదు.. మీరు చిటికిన వేలితో తీర్చెయ్యొచ్చు అని పలువురు బాబుకు సూచిస్తున్నారు!!