Home రాజకీయాలు బాబు ఇన్ ఢిల్లీ …..భూకంపమా బంగాళాదుంపా?

బాబు ఇన్ ఢిల్లీ …..భూకంపమా బంగాళాదుంపా?

SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీలో భూప్రకంపనలు సృష్టిస్తారని తెలుగుదేశం మీడియా ఓ ఊదరగొట్టింది ….తీరా చూస్తే చంద్రబాబు ప్రదాని మోడీకి వంగి ,వంగి దండాలు పెట్టి వచ్చార౦టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు.

నీతి ఆయోగ్ సమావేశంలో ఈ రోజు ప్రధానిని బాబు కలిసినప్పుడు ఎలా నవ్వుతున్నారో చూడండి అని ఆ సన్నివేశానికి సంబందించి పోటోలను అంబటి విలేఖరులకు చూపారు. చంద్రబాబు మరోసారి ఎపి ప్రజలను దగా చేశారని అంబటి మండిపడ్డారు.

చంద్రబాబు నవ్వులో ఒ రకమైన భయం దాగుందని కూడా అంబటి అన్నారు. చంద్రబాబు వ్యవహారం ఎపి ప్రయోజనాలపై రాజీ పడుతున్నట్లుగా ఉందని …ఆ పోటోలలో అది స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. టీవీలలో బడాయి కబుర్లు ఉపన్యాసాలు తప్ప ప్రధాని మోడీ ఎదురుపడినప్పుడు మాట్లాడే పరిస్థితి బాబు కి అస్సలు లేదని అర్దం అయిందన్నారు. ఇంకా చంద్రబాబు పోరాటాలు చేసే వ్యక్తి కాదని, కానీ కాళ్లు పట్టుకునే వ్యక్తి అని ప్రజలకి అర్దం అవుతుందని అంబటి తెలిపారు. మోడీ కుంబకోణాలను బయటపెడతామని ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కుటుంబరావు అనటం గుర్తు చేసి ఎందుకు ఇంకా బయట పెట్టడం లేదని ఆయన అడిగారు.

అంతే కాక చంద్రబాబు అవినీతిపై చర్య తీసుకుంటామన్న బిజెపి నేతలు కూడా ఎందుకో ఆపని చేయడం లేదని, ఇరు పార్టీల వారూ రాజీల డ్రామాలు ఆడుతున్నారని అంబటి ద్వజమెత్తారు. బిజెపితో వైఎస్ ఆర్ కాంగ్రెస్ తో కలుస్తోందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నిజం ఇప్పుడు ఈ ఫోటోలలో తేట తెల్లమైందని వైకాపా ప్రతినిధి అన్నారు.