Home రాజకీయాలు రాజువెడలె రవితేజము లలరగ… వేసుకున్న అంబటి!

రాజువెడలె రవితేజము లలరగ… వేసుకున్న అంబటి!

135
SHARE

ఆదివారం నీతి ఆయోగ్ సమావేశానికి చందబాబు వెళ్తున్నారు.. వెళ్లారంటే ఇక ఢిల్లీలో మామూలుగా ఉండదు.. ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతాయి.. ఇంతకాలం అంటే ఏదో ఎన్ డీఏ తో కలిసి ఉన్నారు కాబట్టి ఊరుకున్నాడు కానీ.. ఇప్పుడు మోడీకి బాబు చేతిలో మూడింది.. రాష్ట్రానికి కావాల్సినవన్నీ ఒక్కదెబ్బతో తీసుకురాబోతున్నారు.. అవసరమైతే మొడీని సైతం నేరుగా కడిగి పాడెసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీయబోతున్నారు.. అంటూ ఒక వర్గం మీడియా ఊకదంపుడు ప్రోగ్రాం లు, పేజీల పేజీల కథనాలు వండి వడ్డించేశాయి. అయితే.. నేడు ఢిల్లీకి వెళ్లిన బాబు మోడీని నిజంగానే నిలదీశారా.. కడిగి పారేశారా..? ఇదే విషయాలపై స్పందించారు అంబటి రాంబాబు.

నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అక్కడ నిలదీసింది, మోడీని కడిగేసింది ఇదయ్యా.. అంటూ చంద్రబాబు – మోడీతో కరచాలనం చేస్తున్న ఫోటోను చూపించారు అంబటి రాంబాబు. ఆ ఫోటోలో మోడీ ఎలా ఉన్నారు.. మన చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారు చూడండి.. లోలోపల ఉన్న భయాన్ని దాచుకుంటూ బాబు నవ్వుతున్నారని ఆ ఫోటోలు చూపిస్తూ చెప్పుకొచ్చారు అంబటి. చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు అని మొదలుపెట్టిన అంబటి.. వాటికి తాజా సంఘటనలు సాక్ష్యాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాబు అనుకూల మీడియాను కూడా వాయించిన అంబటి… రాజువెడలె రవితేజము లలరగ.. అంటూ చంద్రబబౌ ఢిల్లీ యాత్రపై కథనాలు రాసుకొచ్చాయని.. కాని జరిగింది ఇదని సెటైర్స్ వేశారు!

ఆంధ్రప్రదేశ్ లోనూ, అమరావతి లోనూ మాత్రం.. మోడీని కడిగేస్తాను, నిలదీస్తాను అని చెప్పుకునే బాబు… ఢిల్లీ వెళ్లి మాత్రం మోడీ ముందు సన్నాయి నొక్కులు నొక్కుతూ, వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారని తెలిపారు. వీటిని లాలూచీ రాజకీయాలు అనక మరేమంటారని అంబటి ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా మరింత డోసు పెంచిన అంబటి… నీతీఅయోగ్ సమావేశంలో మోడీని కడిగిపారేస్తానని చెప్పుకొచ్చిన చంద్రబాబు, తన అనుకూల మీడియా… మరోసారి ఐదుకోట్ల ఆంధ్రులను దారుణంగా మోసం చేశారని అన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి పోరాటాలు చేసే రకం కాదని.. అందితే కాళ్ళు, లేకుంటే జుట్టు పట్టుకునే టైపని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదని అంబటి తెలిపారు. నీతి ఆయోగ్‌ సమావేశం వల్ల రాష్ట్రానికి ఏంఇ ఒరిగిందో తెలియదు కానీ… ఈ వేదికగా బీజేపీ-టీడీపీల లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని అంబటి తెలిపారు.