Home రాజకీయాలు బుగ్గనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం??

బుగ్గనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం??

SHARE

అధికార తెలుగుదేశం పార్టీ మంత్రుల తీరు బహు విచిత్రం. పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి డిల్లీలో బిజెపి పెద్దలకు కొన్ని పత్రాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయని, ఆ వార్తలు నిజ౦ అయితే కనక శాసనసభ ప్రవర్తనా నియామవళి కి విరుద్ద౦ అవుతుందని ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

శాసనసభలో ప్రాతినిధ్యమే లేని వారికి రాజకీయ పార్టీ సభ్యుడికి పీఏసీ చైర్మన్‌ ఎలా పేపర్లను ఇవ్వగలరని యనమల ప్రశ్నించారు. ఇది సభా ధిక్కారం అని కూడా అన్నారు. ఇంకా ఇదే నిజమైతే బుగ్గనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశ పెట్టడానికి తాము ఏ మాత్రం వెనుకంజ వేయబోమని కూడా ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.

గతంలో శాసన సభలో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారన్న అంశాన్ని ఎంత నేరంగా అయితే పరిగణించారో, దీన్ని అంతకన్నా పెద్దనేరంగానే పరిగణించాలని యనమల అన్నారు.

మరో పక్క రామ్ మాధవ్ తనని బుగ్గన కలవలేదని చెప్పారు. బుగ్గన కూడా తాను ఎలాంటి పత్రాలు ఎవరికీ అందచేయలేదని అన్నారు. ఒకవేళ చేసినా ఇప్పుడు పకడ్బందీ సమాచార హక్కు చట్టం వచ్చాక ప్రభుత్వ పత్రాలలో రహస్యాలు ఉంటాయా అన్నది ప్రశ్న. అసలెందుకు తెదేపా నాయకులలో ఈ ఉలికిపాటు?