Home సినిమా కార్తీ “చినబాబు” ఆడియో జూన్ 23, సినిమా జులై 13న విడుదల

కార్తీ “చినబాబు” ఆడియో జూన్ 23, సినిమా జులై 13న విడుదల

238
SHARE

కార్తీ నటించిన “చినబాబు” సినిమా ఆడియోను జూన్ 23న విడుదల చెయ్యబోతున్నారు. జులై 13న చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించారు. కార్తీ సరసన సయేషా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించడం జరిగింది. ఇటీవల విడుదలైన “చినబాబు” టీజర్ కు మంచి స్పందన లభించింది.

జూన్ 23న జరగబోయే “చినబాబు” ఆడియో విడుదల కార్యక్రమంలో కార్తీ, సూర్య పాల్గొనబోతున్నారు.

నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. నటుడు శత్రు ఈ మూవీలో విలన్ గా నటించాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హీరో సూర్య తో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి “2డి ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ మరియు “ద్వారకా క్రియేషన్స్” బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ (చినదాని) లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.

నటీనటులు:
కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను

సాంకేతిక నిపుణులు:
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
సంగీతం: డి.ఇమాన్
కెమెరామెన్: వేల్ రాజ్
ఎడిటింగ్: రుబన్