Home రాజకీయాలు టీడీపీ నేతల ఆరోగ్యాలపై బుగ్గన వెటకారం!

టీడీపీ నేతల ఆరోగ్యాలపై బుగ్గన వెటకారం!

SHARE

టీడీపీ నేతల మానసిక పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అనే చెప్పుకోవాలి. ఢిల్లీ వేదికగా ఏ ఇద్దరు నేతలు కలిసినా, ఏ ఇద్దరు నేతలు కలిసి బోజనం చేసినా… వీరికి ఇక్కడ ముచ్చెమటలు పడుతున్నాయి. అదిగో.. చంద్రబాబుపై కుట్ర జరుగుతుంది.. అంటూ నానాయాగీ చేసేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఢిల్లీ వెళ్లి.. వేరే పార్టీకి చెందిన నేతతో కలిసినంత మాత్రాన్న.. వారికి ఇక్కడ ముచ్చెమటలు పట్టడం ఏమిటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. చంద్రబాబు మాత్రం.. రాహుల్ గాంధీతోనూ, సోనియా గాంధీతోనూ రాసుకు పూసుకు తిరుగుతారు.. పొరపాటున వైకాపా నేతలు, బీజేపీ నేతలతో కలిసినట్లు కనిపిస్తే మాత్రం నానా హడావిడి చేసి, ఏదో మునిగిపోయినట్లు మాట్లాడతారు. దీంతో… బుగ్గన, టీడీపీ నేతలపై సెటైర్లు గట్టిగానే వేశారు!

తాజాగా బీజేపీనేతలతో భేటీ అయ్యారని తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించి, వివరణ ఇచ్చిన బుగ్గన ఈ సందర్భంగా టీడీపీ నేతలపై తనదైన సెటైర్స్ వేశారు. బీజేపీ నేతలతో ఎవరూ మాట్లాడాకూడదా? అని తెలుగుదేశం పార్టీ నేతల్ని ప్రశ్నించడంతో మొదలుపెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మరో నేత రాంమాధవ్‌ లను కలిసినట్లు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తి సత్యదూరాలని కొట్టిపారేశారు. తనకు రహస్యంగా బీజేపీ నేతలను కలవాల్సిన అవస్రం ఏమీ లేదని, ఒకవేళ తాను నిజంగా బీజేపీ కీలక నేతలను కలిస్తే టీడీపీ వారి పరిస్థితి ఏంటో.. వాళ్ల ఆరోగ్యాలు ఏమవుతాయో అని ఎద్దేవా చేశారు బుగ్గన!

బీజేపీ నేత ఆకుల సత్యనారాయణను తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని, ఏపీ భవన్‌ లో ఆయనను కలిశానని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. లంచ్ కోసం తాము హోటల్ వెళ్లామని చెప్పారు. అలా చూసుకుంటే… టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా తన స్నేహితుడేనని, తనను ఏపీ భవన్‌ లో కలిసి ఆలింగనం చేసుకున్నారని.. మరి దానిపై రాద్దాంతం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తాము టీడీపీలా అర్ధరాత్రి దొంగాటలు ఆడలేమని చురకంటించారు!

ఈ సందర్భంగా లోకేష్ పైనా, చంద్రబాబుపైనా వరుసపెట్టి సెటైర్స్ వేసిన బుగ్గన… నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైన అవగాహన మాత్రం పెరగలేదని.. లోకేష్ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తోందని అన్నారు. ఎంతో ముఖ్యమైన శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి తన ఆలోచనలు ఆ శాఖపై పెట్టకుండా, ఢిల్లీలో ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ బోంజేస్తున్నారు, ఏమి బోజనాలు చేశారు వంటి విషయాలపై కాస్త శ్రద్ధ తగ్గించాలని సెటైర్ వేశారు. మైకు ముందుకొస్తే నోరుజారుతాననే భయంతోనే లోకేష్ కేవలం ట్విట్టర్‌ కే పరిమితమవుతున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు.

అనంతరం బాబుపై దృష్టి సారించిన బుగ్గన… వ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్స్ అంటూ బాబుపై మండిపడ్డారు. చంద్రబాబు వెళ్లి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నాయకులను కలిసి, భుజాలు భుజాలు రాసుకుంటూ తిరగొచ్చు కానీ, తాను మాత్రం స్నేహితులైన బీజేపీ నేతలతో కలవడం తప్పైపోయిందని వ్యాఖ్యానించారు. ట్రంప్, కిమ్ భేటీకి కూడా తామే కారణమని చెప్పుకునే రకం చంద్రబాబు అని ఎద్దేవా చేసిన బుగ్గన… తమ పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి.. నేడు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఫైరయ్యారు!