Home రాజకీయాలు టీడీపీ నేతల పిచ్చి ప్రేలాపణలు!

టీడీపీ నేతల పిచ్చి ప్రేలాపణలు!

SHARE

రాజకీయాల్లో ఆరోపణలు అత్యంత సహజం.. వాటిలో చేసే అబద్దపు ఆరోపణలు గోడకట్టినట్లు లేకపోయినా, కనీసం దడి కట్టినట్లయినా ఉండాలి! ఈ క్రమంలో ఒకేపార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఒకే విషయంలో పూర్తి భిన్నమైన ఆరోపణలు చేయడం మరీ దారుణం. ఈ విషయంలో క్లారిటీ మిస్సయ్యారో లేక.. ఎవరు గట్టి ఆరోపణలు చేస్తే వారు అధినేతకు అంత దగ్గరవుతారని భ్రమించారో తెలియదు కానీ… టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, బుచ్చయ్య చౌదరీలు రెండు భిన్నమైన ఆరోపణలు చేశారు!

మహానాడు వేదికగా జరిగిన మీటింగ్ లో ప్రసంగించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి… మోదీ సుమారు 1500 కోట్ల రూపాయలు వైకాపా అధినేత జగన్ కు ఎన్నికల కోసం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ప్రధాని వెంటనే స్పందించాలని ఉండవల్లి లాంటి వారు స్పందించారు. అంటే… టీడీపీ నేతల లెక్కల ప్రకారం… ప్రధాని మోడీ.. జగన్ కు డబ్బులు ఇచ్చారని. కాసేపు ఆ విషయం అలా ఉంచితే… తన కేసుల మాఫీ కోసం జగన్, అమిత్‌ షాకు రూ.100 కోట్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి!

ఈ రెండు ఆరోపణల్లోనూ పూర్తి కాంట్రడిక్షన్ కనిపిస్తుందనేది స్పష్టం అవుతుంది. బీజేపీ నేతలు జగన్ కు 1500కోట్ల రూపాయలు ఇస్తే… వాటిలో ఒక 100కోట్ల రూపాయలు జగన్.. అమిత్ షాకు ఇచ్చారని అనుకోవాలా? అలా కాకుండా.. జగన్ మాత్రమే అమిత్ షాకు ఇచ్చారు.. ప్రధాని మోడీ.. జగన్ కు ఇవ్వలేదు అని అనుకోవాలా? కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే… రెండింటిలో ఒకటే నిజం అవ్వాలి. జగన్ కు రూ.1500 కోట్లు ఇవ్వగలిగిన బీజేపీ నేతలు, మరలా జగన్ దగ్గర రూ.100 కోట్లు ఎందుకు తీసుకుంటారు? ఇవే దౌర్భాగ్యపు ఆరోపణలు అని కొట్టిపారేస్తున్నారు వైకాపా నేతలు!

కేవలం బురద జల్లే కార్యక్రమంలో భాగంగా… పాపం టీడీపీ నేతలు లాజిక్కులు మరిచి మరీ ఆరోపణలు చేస్తున్నారనే కామెంట్స్ ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇలా పిచ్చి ప్రేలాపణలతో ఆరోపణలు చేయాలని అనుకుంటే… టీడీపీ నేతలంతా అబద్దాలు చెప్పాలనుకున్నప్పుడు ఒకే మాటపై నిలబడి అయినా విమర్శలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. అలా కానిపక్షంలో వీటిని పిచ్చి ప్రేలాపణలుగా ప్రజలు భావించే అవకాశం ఉందనేది వారి వాదన!