Home రాజకీయాలు పసుపు పత్రికలు కాంగ్రెస్ ను ఎత్తుతుంది ఇందుకేనా?

పసుపు పత్రికలు కాంగ్రెస్ ను ఎత్తుతుంది ఇందుకేనా?

502
SHARE

సుమారు గత ఆరున్నర నెలలుగా ప్రజల్లో ఉంటూ పాదాయాత్ర చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత వైకాపా అధినేత జగన్. ఇసుకవేస్తే రాలనంత జనం ఆయన వెంట పాదం కలుపుతున్నారు. ప్రభుత్వ సమస్యలపై జగన్ ఏకరువుపెడుతున్నారు. జనాలు జగన్ వద్దకు వచ్చి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా… జగన్ ని ఒక్కరోజంటే ఒక్క రోజు ఇంటర్వ్యూ చేసిన పాపాన పోలేదు, కనీసం జగన్ యాత్రలకు వస్తున్న జనం చెప్పుకుంటున్న సమస్యలను సైతం కవర్ చేసింది లేదు. ఆహో ఓహో అంటూ పొగడాల్సిన అవసరం లేదు కానీ.. కనీసం పత్రికకు ఉన్న ప్రథమ లక్షణం తాలూకు విలువలైనా చూపించాల్సిన బాధ్యత మరిచి నడుస్తున్నాయి పసుపు పత్రికలు! కానీ… కాంగ్రెస్ ను మాత్రం తాజాగా పైకెత్తే కార్యక్రమానికి తెరలేపాయి.

ఈ స్థాయిలో పత్రికా విలువలు కాలరాస్తూ వ్యవహరిస్తున్న ఈ మీడియా వర్గాలు.. ఇప్పుడు ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి బజన చేయడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అంటే.. అందరికీ తెలిసిన విషయ్మే. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ద్రోహం ఏమిటి? అంటే చిన్న పిల్లాడు సైతం చెప్పే పరిస్థితి. అంతెందుకు… నిన్న మొన్నటివరకూ టీడీపీ నాయకులు, ఈ వర్గం మీడియా కూడా కాంగ్రెస్ ను ఉతికి ఆరేసాయి. ఇంతలో ఏమి జరిగిందో తెలియదు… టిడిపి అనుకూల పత్రికలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారిపోయి, భజన చేయడం, ప్రచారాలు కల్పించడం మొదలుపెట్టాయి.

ఈ క్రమంలో ఏపీ నూతన వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్‌ చాందీతో టిడిపి అనుకూలపత్రికలకు ప్రత్యేక ఇంటర్వులు ప్రచురిస్తూ.. ఈయన హయాంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతమయ్యే అవకాశాలున్నాయన్న రేంజ్ లో రాసేస్తున్నాయి. పోనీ నిజంగా వచ్చిన వ్యక్తి అంత సమర్ధుడా అంటే… కేరళకు చెందిన ఈయన.. గతంలో కాంగ్రెస్ పార్టీ సీఎంగా పనిచేసినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ ను మళ్లీ కాపాడే ప్రయత్నం చేయడంలేదు. అక్కడ ఉద్ధరించలేని చాందీ.. ఏపీలో కాంగ్రెస్ ను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్ధరిస్తాడనేది పసుపు పత్రికల కథనాల సారాంశం!

ఈ విషయాలపై కాస్త జాగ్రత్తపా పరిశీలిస్తే… వాస్తవాలు ఇట్టే అర్ధం అవుతాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండవచ్చు అనే వార్తలు బలంగా వస్తున్నాయి. జనాలు ఏమనుకుంటారో అని ఎక్కడైనా చీమకుట్టినట్లు అనిపించినా… డైరెక్టుగా పొత్తు లేకుండా, లోపాయకారీ ఒప్పందాలు చేసుకోవచ్చు. ఈ క్రమంలో జగన్ కు పడే కాంగ్రెస్ మార్కు ఓట్లను ఎన్నో కొన్ని చీల్చాలి అనేది ఆ వర్గం మీడియా టార్గెట్ అని తెలుస్తుంది! దీనికోసమే… బాబు క్షేమం కోరే ఆ పత్రికలు… గతం మరిచి కాంగ్రెస్ కు సన్నాయినొక్కులు నొక్కుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. అంతకు మించి కాంగ్రెస్ పై ఆ పత్రికలకు కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమేమీ లేదని.. ఇది ప్రస్తుతానికి బాబు వాడుకోవడానికి ఏర్పరుచుకున్న తాత్కాలిక ప్రేమ అని చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే… గత ఎన్నికల్లో బీజేపీ బలైనట్లు, రేపు కాంగ్రెస్ బలవ్వబోతుందన్న మాట!!