Home రాజకీయాలు పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో క్రిమినల్స్ గ్యాంగ్స్: ప్రకాశ్ రెడ్డి

పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో క్రిమినల్స్ గ్యాంగ్స్: ప్రకాశ్ రెడ్డి

SHARE

ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పై వైసీపీ రాప్తాడు ఇన్ చార్జి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శల దాడి చేశారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ తోపుదుర్తి పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో దాదాపుగా పది క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని అన్నారు. పరిటాల వర్గీయులు విచ్చల విడిగా నేరాలకు పాల్పడుతున్నారని, పోలీసులు కూడా చూసి చూడనట్టు అస్సలు స్పందించడం లేదని ఆరోపించారు.

పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా అని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. హత్యలు, కిడ్నాప్ లు మంత్రి పరిటాల సునీత ప్రోత్సహిస్తున్నారని, ఆమెను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక పొతే వైకాపా నాయకుడు, మాజీ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ, టీడీపీ నేతల గూండాగిరికి పోలీసువారి వత్తాసు కూడా ఉందని అన్నారు. తెదేపా నాయకులపై ఉన్న కేసుల్లో విచారణ సరిగ్గా లేదని ఆరోపించారు.