Home రాజకీయాలు హైదరాబాద్ ఎందుకు విడిచారో చెప్పిన బాబు!

హైదరాబాద్ ఎందుకు విడిచారో చెప్పిన బాబు!

519
SHARE

పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉండి కూడా.. ఉన్నపలంగా తట్టా బుట్టా సర్ధుకుని హుటా హుటిన అమరావతికి చంద్రబాబు ఎందుకు వెళ్లిపోయినట్లు? అదేంటి ఆమాత్రం సమాధానం తెలియదా… “ఓటుకు నోటు కేసు” వల్ల అని చిన్న పిల్లాడు కూడా చెప్పేలా తయారయ్యింది పరిస్థితి. ఈ విషయం బాబు అండ్ కో కు తెలిసినా.. బయటకు చెప్పలేని పరిస్థితి. హాయిగా హైదరాబాద్ లో ఉంటే… అమరావతిలో తాత్కాలిక భవనాలు కాకుండా.. మొదలు పెట్టడమే శాస్వత భవనాల నిర్మాణాలతో మొదలుపెట్టి.. పని చేసి ఉంటే.. ఇపాటికి కొత్త రాజధానికి హాయిగా పరిపాలన మొదలయ్యేది. కానీ… ఈ విష్యాలు పక్కన పెట్టిన సీనియర్ పొలిటీషియన్.. ఉన్నపలంగా ఎందుకు వెళ్లిపోయారో చెబుతున్నారు చంద్రబాబు!

సరిగ్గా ఆలోచిస్తే… ఓటుకు నోటు కేసు ఏపీకి కలిగించిన ఆర్ధిక నష్టం అంతా ఇంతా కాదు! ఆ కేసులో బాబు ఇరుక్కుని ఉండకపోతే… ఇప్పటికీ హైదరాబాద్ లోనే ఉన్న సొంత ఇంటిలో ఉంటూ, పరిపాలన సాగిస్తూ.. ఇటు ఏపీ రాజధానిలో ప్రస్తుత పరిపాలనకు అవసరమైన “శాస్వత నిర్మాణాలు” చేపట్టి ఉండొచ్చు. అలా కాకుండా బాబు ఇరుక్కుని, భయపడి పారిపోవడం వల్ల.. ఇప్పటికీ అమరావతిలో ఒక్క శాస్వత ఇటుక కూడా పడలేదు.. అన్నీ తాత్కాలిక వ్యవహారాలే. ఈ క్రమంలో.. తాను హైదరాబాద్ ని విడిచి వెళ్లింది ఓటుకు నోటు కేసుకోసం కాదు అనే సంకేతాలు ఇస్తున్నారు చంద్రబాబు.

ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ఏ పని చేయకపోయినా, ఏ విషయంలో రాష్ట్రానికి తెలిసి అన్యాయం చేస్తున్నా, బీజేపీతో స్నేహం లేని సమయంలో ఇచ్చిన హామీలు నరవేర్చకపోయినా కూడా.. ప్రజలకు చెప్పే మాట “ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి” అని! అన్నింటికీ ఇలా ఒకటే సూత్రాన్ని కనిపెట్టుకున్న చంద్రబాబుకు.. కాస్త ఆలస్యంగా ఈ ఆలోచన వచ్చిందో ఏమో కానీ… హోదా ఇస్తాంమని కేంద్రం చెప్పినందువల్లే పదేళ్లు హైదరాబాదులో ఉండే అవకాశం ఉన్నా, రాజధానిని అమరావతికి తరలించాం అని చెప్పుకొస్తున్నారు.

అంటే… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. హైదరాబాద్ లో ఉండి పరిపాలన సాగించకూడదా? చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటే.. అక్కడ అమరావతి నిర్మాణం జరగదా? పోనీ ఈ కండిషన్ ఏమైనా కేంద్రం పెట్టిందా? “మీరు అమరావతికి వెళ్లిపోతేనే హోదా ఇస్తామని” ఏమైనా చెప్పిందా? అలాంటి దేమీ లేదే! ఇది బాబు మార్కు కామెడి. ఇదే కాసేపు గుండెలు రాయలౌ చేసుకుని నిజం అనుకుంటే… హైదరాబాద్ ని ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాత చంద్రబాబు ఎప్ప్డూ.. హోదా టాపిక్కే ఎత్తలేదు ఎందుకో? నిజంగా హోదా గురించే అమరావతికి షిప్ట్ అయిపోతే… విజయవాడకు వచ్చినప్పటి నుంచి బాబు ఆ విషయంపై పోరాడేవారు.. స్నేహం వల్ల ఆయన బీజేపీతో పోట్లాడలేకపోయినా.. ఆ విషయంపై పోరాడుతున్నవారిని అరెస్టులు గట్రా చేయించేవారు కాదు! ఇవన్నీ జనాలకు తెలియదని నిత్యం భావించే బాబు… తాజాగా హైదరాబాద్ నుంచి లగెత్తడానికి కూడా హోదానే కారణం అని కొత్త రాగం తీశారు.

ఏది ఏమైనా… ఈ ప్రత్యేక హోదా ఏపీకి ఎంత మేర లాభమో కానీ, బాబు కు మాత్రం అన్ని విషయాలకూ ఒక సాకుగా బలే ఉపయోగపడుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి!!