Home రాజకీయాలు టీడీపీ దిగజారుడు తనం చెప్పిన 27!

టీడీపీ దిగజారుడు తనం చెప్పిన 27!

2128
SHARE

టీడీపీ నాకులది భయమో లేక బురదజల్లే కార్యక్రమమో తెలియదు కానీ… వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ నేతలకు కలిశారని ప్రచారం చేశారు. అదిగో బీజేఫీ – వైకాపా కలిసిపోతుందని ఒకరంటే… బుగ్గన, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు కాబట్టి… ఆయన నుంచి బీజేపీ నేతలు రాష్ట్ర ఆధిక వ్యవహారాల గురించి ఏవేవో కాగితాలు రప్పించుకున్నారని.. ఇదంతా బాబుపై జరుగుతున్న కుట్ర అని కంగారు పడిపోతున్నారు. తాను నిజంగా నిప్పు అయితే… ఎవరు ఎన్ని ఆరోపించుకుంటే మాత్రం, ఎవరు ఎన్ని పథకాలు రచిస్తే మాత్రం వచ్చిన నష్టమేమిటో చంద్రబాబే చెప్పాలి. ఈ క్రమంలో బుగ్గనపై బురదజల్లి… ఏపీ భవన్ లో ఏదో జరగబోతుంది అంటూ చూపించబోయి… తమ దిగజారుడు తనాన్ని బయటపెట్టుకున్నారు టీడీపీ నేతలు!

ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చిన బుగ్గన… తాను ఏపీ భవన్ కు వెళ్లిన మాట వాస్తవమని, ఆకుల సత్యనారాయణ తనకు వ్యక్తిగతంగా స్నేహితుడు కాబట్టి.. ఆయనను కలిశానని.. ఆయనతో పాటు సౌత్ ఎవెన్యూకి వెళ్లాలని… సౌత్ ఎవెన్యూలో సుమారు 400 నుంచి 500 మంది ప్రముఖ ఎంపీలు, అధికారుల నివాసాలు ఉంటాయని… తాను ప్రత్యేకంగా 27 సౌత్ ఎవెన్యూకి వెళ్లలేదని… తాను 27 ఎవెన్యూ కి వెళ్లడం వల్ల బీజేపీ నేత రాం మాదవ్ ని కలిసినట్లు సృషిటిస్తున్నారని తెలిపారు. కేవలం సౌత్ ఎవెన్యూ అని రాసిన చోట తాను సంతకం చేస్తే… 27 అనే అంకె తర్వాత కలిపారని, తప్పుడు రికార్డులు సృష్టించారని సాక్ష్యాలు బయట పెట్టారు. దీంతో… టీడీపీ నేతలు మరీ ఇంత దిగజారిపోతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదే క్రమంలో.. తానేదో కాగితాలు, లెక్కలు పట్టుకెల్లి బీజేపీ నేతలు ఇచ్చానని చెబుతున్నా మాటల్లో అసలు లాజిక్కే లేదని బుగ్గన క్లారిటీ ఇచ్చారు. పీఏసీ చైర్మన్‌ గా తాను నిజంగా బీజేపీ నేతలకు ఏవైనా నివేధికలు ఇవ్వాలనుకుంటే, అది కూడా రహస్యంగా ఇవ్వాలనుకుంటే… విజయవాడ, రాజమండ్రిలలో విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణలకు ఇచ్చేవాడిని స్పష్టం చేశారు. అర్ధరాత్రి దొంగాటలు తమ పార్టీ సిద్దాంతం కాదని నొక్కి చెప్పిన బుగ్గన… రహస్యంగా బీజేపీ నేతలను కలవాల్సిన అవసరం తనకు లేదని తెగేసి చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకూ తాను ఆకుల సత్యనారాయణ తో కలిసి అమిత్ షాను కలిశానని టీడీపీ నేతలు ప్రచారం చేశారు… ఈరోజు సౌత్ ఎవెన్యూలో ఆకులతో కలిసి వెళితే… 27 అనే అంకె యాడ్ చేసి, రాం మాధవ్ ని కలిశానని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు!

ఈ మాటలు, బుగ్గన చూపించిన సాక్ష్యాలు చూసిన వారు మాత్రం… అసలు బుగ్గన బీజేపీ నేతలను కలిస్తే వచ్చిన నష్టమేమిటి అని కొందరు ప్రశ్నిస్తుంటే… అసలు దీనికి ఇంత కంగారు పడిపోవాల్సిన అవసరం ఏముందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో… రికార్డుల్లో 27 అని దొంగచాటుగా ఎంటర్ చేసి, దానితో బుగ్గనపై బురద జల్లడానికి సైతం టీడీపీ నేతలు దిగజారిపోవడం.. అత్యంత దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు!