Home రాజకీయాలు “బుగ్గన నేను ఒకే కారులో వెళ్లి హోటల్‌లో భోజనం చేశాం!”

“బుగ్గన నేను ఒకే కారులో వెళ్లి హోటల్‌లో భోజనం చేశాం!”

1181
SHARE

ఢిల్లీలో నిన్న బీజేపీ నేత ఆకుల సత్యనారాయణతో వైకాపా లీడర్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి భేటీ అయినట్లు ఓ వీడియో హల్‌చల్‌ చేస్తోన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా బుగ్గన బీజేపీ నాయకుడు ఆకుల తనకు మిత్రుడని చెప్పారు. కేవలం తనని కలిసి ఓ హోటల్ లో భోజనానికి వెళ్లానని స్పష్టం చేశారు. అయితే తెదేపా నాయకులూ వైకాపా భాజపా తో అనైతిక సంబంధం సెట్ చేయడానికే బుగ్గన ఢిల్లీ వెళ్లారని, బీజేపీ వారిని కలుస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇదే విషయంపై ఆకుల కూడా స్పందించారు. ఏపీ భవన్‌లో తనను బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కలిశారని, ఇద్దరమూ ఒకే కారులో వెళ్లి హోటల్‌లో భోజనం చేసి వచ్చామని తెలిపారు. ఢిల్లీలో టీడీపీపై కుట్ర జరుగుతోందంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని అమిత్‌ షా, రామ్‌మాధవ్‌ను వైసీపీ ఎమ్మెల్యే బుగ్గనతో కలిసి తాను కలవలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరీ వాదించారు.

టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలకు ఆధారాలు కానక ఉంటే చూపాలని సవాలు చేశారు. తెదేపా కుట్ర రాజకీయాలు చేస్తుందని అందరికీ తెలుసనీ ఆ కంటి చూస్తూ తాము కూడా చేస్తున్నామని తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.