Home రాజకీయాలు పసుపు పత్రికల జ్ఞానం ఇంతేనా!?

పసుపు పత్రికల జ్ఞానం ఇంతేనా!?

393
SHARE

జగన్ పాదయాత్ర జనరంజకంగా దూసుకుపోతున్న తరుణంలో… కేడర్ కు మరింత ఉత్సాహాన్నించింది గోదావరి జిల్లాలో యాత్ర! ఇప్పటివరకూ జగన్ పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సాగుతున్న వైనం అంతా చూస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన ప్రాంతాల్లో జగన్ పాదయాత్రకు.. గోదావరి జిల్లాల్లోని జగన్ పాదయాత్రకు ఉన్న తేడా గమనించారో ఏమోకానీ… ప్రత్యేకంగా పశ్చిమగోదావరిలో జగన్ యాత్ర వల్ల పార్టీకి పెద్దగా ఒరిగింది లేదనే కొత్త సూత్రాన్ని కనిపెట్టుకుని, రాసుకుని, ఆత్మవంచనకు సిద్దపడుతున్నాయి పసుపు పత్రికలు!

జగన్ ఇప్పటివరకూ పాదయాత్ర చేసిన జిల్లాల్లో… ప్రజలు లక్షల సంఖలో పాల్గొన్నారు. అయితే.. అక్కడ ప్రస్తుతం ఉన్న నాయకులు, ఇతర పార్టీ నాయకులు ఎవరూ జగన్ పార్టీలో పెద్దగా చేరలేదు. ఇదే క్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఊహించని రీతిలో సాగిన జగన్ పాదయాత్ర ఫలితంగా.. పార్టీలో కొత్తగా చేరిన నాయకులు లేరు! ఇదే క్రమంలో.. ఇంత హడావిడి చేస్తున్నారు, పశ్చిమ గోదావరి జిల్లా గురించి.. మరి అక్కడ కూడా ఎవరూ పార్టీలో చేరలేదు కదా అని ప్రశ్నిస్తున్నాయి పసుపు పత్రికలు. ఆ కారణాన్ని చూపించి… జగన్ పార్టీకి ఒరిగింది ఏమీ లేదని తేల్చి పారేస్తున్నాయ్! అంటే… వారి దృష్టిలో అనైతికంగా ఇతరపార్టీ నేతలు వచ్చి చేరితేనే, వారికి జగన్ ఆశచూపించి చేర్చుకుంటేనే… పాదయాత్రకు ఫలితం వచ్చినట్లు!

కానీ… జగన్ పాదయాత్ర చేస్తుంది ఎందుకు? ప్రజల కష్టాలు మరింత లోతుగా తెలుసుకోవడానికి.. బాబు పాలనలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పడానికి.. ఆ పాలనలో ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవడానికి.. భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి. ఈ విషయాలు మరిచిన పసుపు మీడియా.. ఇతర పార్టీల నుంచి అనైతిక చేరికలు లేకపోయే సరికి… నో యూజ్ అంటూ రాసేసుకుంటున్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. అలా అనైతిక చేరికలకు జగన్ ప్రోత్సాహం ఎప్పుడూ ఉండదు అని. ఒక వేళ చేరితే… ఆ పార్టీలకు రాజినామాలు చేసి చేరాలి. ఇంకా ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండగా.. అలాంటి పనులు జగన్ ఏమాత్రం ప్రోత్సహించరు.. దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు!!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం… జగన్ ఇప్పుడే కొత్తగా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇప్పటికే ప్రతీ నియోజకవర్గంలోనూ సమర్ధుడైన నాయకులు ఉన్నారు! ఇక పశ్చిమలో జగన్ కు గత ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు.. అంటే ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే! అలాంటప్పుడు కొత్తగా పార్టీలో చేరే వారు ఎక్కడనుంచి వస్తారు? కొత్త నాయకులు వచ్చినా.. వారికి మీడియా అంత హైలెట్ చేసే అవకాశం లేదు! ఈ క్రమంలో జనం అంతా జగన్ వెంట తండోపతండాలుగా తోడొస్తుంటే… నాయకులు, అది కూడా పక్క పార్టీ నాయకులు చేరలేదని.. కాబట్టి జగన్ పాదయాత్ర వల్ల ప్రయోజనం శూన్యం అని చెప్పుకోవడం చూస్తుంటే… వారికి రాజకీయ కోణాలు తప్ప, నైతిక కోణాలు, సాధారణ కోణాలు, ప్రజా సమస్యల కోణాలు, ప్రజా శ్రేయస్సు కోణాలు తెలియదని అనిపించక మానదు అనేది పలువురి అభిప్రాయంగా ఉంది!