Home రాజకీయాలు కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి అంటూ…!

కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి అంటూ…!

505
SHARE

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేసే క్రమంలో… టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. బాబుకు వ్యతిరేకంగా తాను ఏపీలో పర్యటిస్తానని, బాబు నిజస్వరూపం ప్రజలముందుపెట్టి ఎండగడతానని మోత్కుపల్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. బాబు చేతిలో అడ్డంగా మోసపోయిన మోత్కుపల్లికి కొన్ని రోజుల కిందట, ఆయనకు సంఘీబావంగా ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆయనను కలిసి, తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇదే క్రమంలో తాజాగా విజయసాయి రెడ్డి ఆయనను హైదరాబాద్ లో కలిశారు. దీంతో… చంద్రబాబు నాయుడు టార్గెట్ గా అనూహ్య రీతిలో ఎదురుదాడి చేస్తున్న పరంపరలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇటీవల విజయసాయి రెడ్డి.. మోత్కుపల్లిని కలిసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంపై తాజాగా విజయసాయి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. “మోత్కుపల్లిని కలవాలంటే నాకు చంద్రబాబు అనుమతి అవసరం లేదు.. వాస్తవానికి నాకు మోత్కుపల్లిని కలవాలనే ఆలోచన కూడా లేదు కానీ… టీటీడీ నేతలకు బుద్ధి చెప్పేందుకే ఆయన్ను కలవాలని భావిస్తున్నా” అంటూ విజయసాయిరెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. నాడు అన్నట్లుగానే నేడు ఆయన మోత్కుపల్లిని కలిశారు. ఈ భేటీలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై చర్చించిన అనంతరం… ఏపీలో మోత్కుపల్లి యాత్రకు తమ పార్టీ మద్దతు ఉంటుందని విజయసాయి ప్రకటించారు! దీంతో… ఇక మోత్కుపల్లి చేతిలో బాబుకు వాయింపేననే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

చంద్రబాబు పేరెత్తితేనే అంతెత్తున లేచిపోయే మోత్కుపల్లి… ఈ భేటీ అనంతరం మాట్లాడుతూ బాబుపై విమర్శల్లో మరింత డోసు పెంచారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోత్కుపల్లి… కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చంద్రబాబు గమనించాల్సిన విషయం ఏమిటంటే… “ఏ పదవి అయినా నువ్వు ఇస్తే తప్ప, నేను ఎన్నడైనా అడిగానా? నీకు దమ్ముంటే నేరుగా మాట్లాడు.. మీడియా ద్వారా తన తప్పేంటో చెప్పు” అంటూ నిలదీశారు. ఇదే క్రమంలో చరిత్ర తవ్విన మోత్కుపల్లి, బాబుని ఉద్దేశించి… “నువ్వొక బ్రోకర్‌ వి, దందా కోరువి.. అల్లుడి వేషంలో వచ్చి ఎన్టీఆర్‌ ని చంపి, పార్టీ జెండా ఎత్తుకుపోయిన దొంగవు నువ్వు” అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా… చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే ఎన్టీఆర్ జెండాను పక్కనబెట్టి, సొంత జెండాతో పోటీ చేయాలని సవాల్ విసిరారు మోత్కుపల్లి.