Home రాజకీయాలు ఈవీఎం ల ఊసు ఎత్తి తెదేపా ఆత్మ రక్షణలో పడిపోయింది: లక్ష్మి పార్వతి!

ఈవీఎం ల ఊసు ఎత్తి తెదేపా ఆత్మ రక్షణలో పడిపోయింది: లక్ష్మి పార్వతి!

333
SHARE

తెలుగుదేశం పార్టీ అధినేత స్వయానా ముఖ్యమంత్రే ఈవీఎం ల పనితీరుపై అనుమానం వ్యక్తం చేయటం ఆశ్చర్యమే. ఈవిఎమ్ లు దుర్వినియోగానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తెదేపా క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని నాయుడు పిలుపునివ్వటం తెలిసిందే. అదే విషయం పై వైకాపా నాయకురాలు లక్ష్మి పార్వతి మాట్లాడుతూ ఈవిఎమ్ ల గురించి తెదేపా నాయకులూ మాట్లాడుతున్నారంటేనే వారు తమ ఓటమిని అంగీకరించినట్లేనని అన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ధిక మంత్రి యనమల రామకృస్ణుడు ఈవిఎ౦ ల గురించి వాటి టాంపరింగ్ గురించి అనుమానాలు వ్యక్తం చేయటం ద్వారా తెదేపా వారు ఎంత ఆత్మరక్షణలో పడ్డారో అర్దం అవుతుందని ఆమె చెప్పారు.

చంద్రబాబు సన్నిహితుడు వేమూరి ప్రసాద్ గతంలో ఓ ఈవిఎ౦ ను దొంగిలించి తీసుకు వచ్చి వాటిని టాంపరింగ్ చేయవచ్చని చంద్రబాబు ప్రచారం చేశారని, అప్పుడు ఎన్నికల సంఘం ఆయనపై కేసు పెట్టిందని ఆమె గుర్తు చేశారు. అటు పిమ్మట చంద్రబాబు అదికారంలోకి వచ్చాక అదే వేమూరి ప్రసాద్ కు ప్రభుత్వ పదవి ఇచ్చిందని గుర్తు చేశారు.

ఇక గత ఎన్నికలలో ఈవీఎం ల టాంపరింగ్ ద్వారానే తెదేపా గెలిచిందా అని లక్ష్మీపార్వతి ఘాటుగా ప్రశ్నించారు!!