Home రాజకీయాలు కాంగ్రెస్ – టీడీపీ.. ఏపీలో కలవరు!

కాంగ్రెస్ – టీడీపీ.. ఏపీలో కలవరు!

SHARE

ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న పరిస్థితుల్లోనూ, గత కొంతకాలంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు, ఆయన వినిపిస్తున్న మాటల్లోనూ ఒక విషయం స్పష్టం అవుతుంది! అదేమిటంటే… కేంద్రంలో బీజేపీ రాదు, రాకూడదు.. తృతియ ఫ్రంట్ రాదు, రాకూడదు.. ఇక మిగిలింది యూపీయే కూటమి! బాబు కోరిక కూడా ఇదే… రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని! అయితే… ఈ విషయాలు పరిగణలోకి తీసుకున్నవారంతా… రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ – కాంగ్రెస్ కలిసి పోటీచేస్తాయని చెప్పుకున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడిన బాబు… కాంగ్రెస్ తో స్నేహం ఢిల్లీకి మాత్రమే పరిమితం చేసి, ఏపీలో మాత్రం కాంగ్రెసేతర శక్తిగానే ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయాలపై తాజాగా కాంగ్రెస్ వైపునుంచే సమాధానం వచ్చింది! ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి గా బాధ్యతలు స్వీకరించిన ఊమెన్ చాందీ కి పసుపు పత్రికలు తెగ ప్రచారం కల్పిస్తున్న సంగతి తెలిసింఏ. ఈ క్రమంలో ఏ భరోసానో తెలియదు కానీ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నారు ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ! రాష్ట్రంలో స్వతంత్రంగా బలపడి అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేయడంతోపాటు.. ప్రజారంజక పాలన కాంగ్రెస్‌ తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్న చాందీ.. తన మాటల్లో బీజేపీని ఏకిపారేస్తున్నారు కానీ, టీడీపీని మాత్రం ఒక్క మాట అనే ఆలోచన చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్లాలని అనుకుంటే.. కచ్చితంగా టార్గెట్ చేయాల్సింది, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని. కానీ… ఆయన మాటల్లో బీజేపీ పై చేసే విమర్శలు మాత్రమే కనిపించడం గమనార్హం. టీడీపీపై అడపాదడపా విమర్శలు చేసినా… అవి తమలపాకుతో కొట్టడంగానే అనిపిస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి!

దీంతో… ఏపీలో కాంగ్రెస్ తో కలిస్తే.. ఎన్టీఆర్ అభిమానులనుంచి వ్యతిరేకత వస్తుందేమో, తనకు మరీ నైతిక విలువలు లేవని పూర్తిగా ఒప్పేసుకున్నట్లు అవుతుందేమో అని గ్రహించిన చంద్రబాబు… కాంగ్రెస్ తో స్నేహాన్ని ఢిల్లీ లో మాత్రమే కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నట్లున్నారని అంటున్నారు విశ్లేషకులు! ఎందుకంటే… కాంగ్రెస్ కు చంద్రబాబు నుంచి కావాల్సింది కూడా ఎంపీ సీట్లే… ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్లినా, కలిసి వెళ్లినా ఇప్పట్లో ఒరిగే ప్రయోజనం శూన్యం కాబట్టి అని పలువురు అభిప్రాయపడుతున్నారు!