Home రాజకీయాలు లోకేష్ ను లైట్ తీసుకుంటున్నారా?

లోకేష్ ను లైట్ తీసుకుంటున్నారా?

SHARE

చంద్రబాబుపై టీడీపీ పెద్దలు అనబడే వారు, మంత్రుల్లో కొంతమంది చూపించే గౌరవం, అభిమానం నిజం కాదనే కామెంట్స్ టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తుంటుంది! ఇదంతా బలవంతపు గౌరవం అని కొందరంటుంటే.. ఇష్టం లేని కాపురం వ్యాహారం అని మరికొందరు అంటుంటారు! ఎవరు ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి, పార్టీ హెడ్డు కాబట్టి.. కచ్చితంగా గౌరవం ఇచ్చి తీరతారు, ఆయనకు ఆగ్రహం రాకుండా చూసుకుంటారు! కానీ… అదే గౌరవం, అదే మర్యాద, అదే ప్రోటోకాల్ వంటివి.. ముఖ్యమంత్రి తనయుడి విషయంలో పాటించడం లేదు అనే కామెంట్స్ ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తున్నాయి! దానికి కారణం లోకేష్ ప్రవర్తనే అనేవారూ లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం!

విషయానికొస్తే… నారా చంద్రబాబు నాయుడు… తన కుమారుడిని, సీనియర్లు అయిన తమపై బలవంతంగా రుదూతున్నారని, పెత్తనం చేయిస్తున్నారని చాలా మంది సీనియర్ నాయకులు, మంత్రులు ఆఫ్ ద రికార్డ్ చెబుతుంటారని టాక్! ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక సంఘటన… లోకేష్ పై మిగిలిన కేబినెట్ అంత పెద్ద గౌరవం ఏమీ ఇవ్వడం లేదని, చంద్రబాబుకు ఇచ్చిన మర్యాదలో పావు వంతు కూడా ఇచ్చి, పట్టించుకోవడం లేదని చెప్పే సన్నివేశం ఒకటి జరిగింది. తాజాగా నారా లోకేష్‌ అనంతపురం జిల్లా , మడకశిర పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన మధ్యాహ్నం 12.30 గంటల నుండి సాయంకాలం సుమారు 5 గంటల వరకు సాగింది. అయితే ఏముంది అందులో వింత.. అంటారా.. అక్కడే ఉంది అసలు విషయం!

ఇదే పని ముఖ్యమంత్రి చేస్తే… మొత్తం ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు అంతా అక్కడే తిష్ట వేస్తారు! మరి.. ముఖ్యమంత్రి తర్వాత, ముఖ్యమంత్రి అంతటివారని చెప్పుకుంటున్న లోకేష్ పర్యటన చేస్తే… ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఈ పర్యటనలో చివరి వరకు పాల్గొనకపోవడం స్థానికంగ చర్చనీయాంశమైందట. జిల్లా మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, జిల్లా ఇన్‌ చార్జ్‌ మంత్రి ఉమామహేశ్వరరావులు… నారా లోకేష్‌ పర్యటనలో పాల్గొనేందుకు మడకశిరకు వచ్చి.. అలా ముఖం చూపించి అలా మీటింగ్ మధ్యలోని వెల్లిపోయారు! మంత్రులే అలా చేసారని భావించారో లేక మరో ఉద్దేశ్యంతో చేశారో తెలియదు కానీ… ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి , శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి కూడా పర్యటన చివరి వరకు ఉండకుండా… మధ్యలోనే జంప్ అయిపోయారంట!

దీంతో.. మా లోకేష్ కు మిగిలిన మంత్రులెవరూ నిజమైన విలువ ఇవ్వడం లేదని తెగ ఫీలయిపోతున్నారంట చినబాబు ఫ్యాన్స్. చంద్రబాబు పై ఉన్న భయం చినబాబుపై గౌరవంగా చూపిస్తున్నారే తప్ప.. లోకేష్ వారి దృష్టిలో ట్వల్త్ మేన్ అయినట్లు ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారంట! మరి ఈ విషయం చినబాబు, పెదబాబుకు చేరవేశారో లేదో… పెదబాబుకు తెలిస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి మరి!!