Home రాజకీయాలు “బాబు నీకు దమ్మూ ధైర్యం ఉంటే స్టేలన్నింటిని వెకేట్ చేయించుకో”

“బాబు నీకు దమ్మూ ధైర్యం ఉంటే స్టేలన్నింటిని వెకేట్ చేయించుకో”

SHARE

చంద్రబాబు నాయుడు అక్రమంగా సంపాదించినదంతా విదేశాల్లో దాస్తున్నారంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన చంద్రబాబునాయుడు తన అక్రమార్జన అంతా దుబాయ్, సింగపూర్, అమెరికా దేశాల్లో దాస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సంపాదించిన ఆస్తులపై సీబీఐ విచారణ జరగాలి అని కూడా మోత్కుపల్లి అన్నారు. మళ్ళీ ఒకవేళ దొరికిపోయినా కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. బాబుకి సవాల్ విసురుతూ దమ్ము, ధైర్యం ఉన్నట్టయితే ఆ స్టేలన్నింటినీ వెకేట్ చేయించుకోమన్నారు.

చంద్రబాబు ఓపెన్ గా ముందుకు రావాలి అన్నారు. సీబీఐ ఎంక్వయిరీ జరిపితే కచ్చితంగా బాబు ఎంత సంపాదించారో బయటకొస్తుంది. ఇంకా మోత్కుపల్లి బాబు ని ఉద్దేశిస్తూ: “రాజ్యసభ సీట్లను అమ్ముకుంటావా? రాజ్యసభ సీటు ఇస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? ఈ సీటును టీజీ వెంకటేష్ కు వంద కోట్లకు నువ్వు అమ్ముకోలేదూ? సీఎం రమేష్ దగ్గర నువ్వు డబ్బు తీసుకున్నావా, లేదా? గరికపాటి మోహన్ రావుకు నువ్వు డబ్బులు తీసుకోకుండానే ఇచ్చావా? మోత్కుపల్లి వాళ్లను తప్పుబట్టడం లేదు అంటూ బాబు సీట్ లను వేలం వేశాడు అన్నారు, వాళ్లు కొన్నారు. వేలం వేస్తామని బోర్డు పెడితే కొనుక్కోకుండా ఎవరుంటారు? తప్పెవరిది.. లీడర్ ది. రాజ్యసభలో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉండకూడదా… అ౦టూ మోత్కుపల్లి బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.