Home సినిమా నటి అపూర్వకి కాల్ గర్ల్ గా 40 వేలు వెల కట్టారు

నటి అపూర్వకి కాల్ గర్ల్ గా 40 వేలు వెల కట్టారు

318
SHARE

చొక్కారావు గణేష్ మాజీ ప్రిన్సిపాల్ఆ; కానీ అదేం పాడు బుద్ధో టాలీవుడ్ నటీమణుల వివరాలు చెత్త వెబ్సైటు లలో పెట్టి పోలీసులకు చిక్కాడు.

ఈ ఉదంతం టాలీవుడ్ లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఇక ఈ కేసు బయటకు రావడానికి కారణం సినీ నటి అపూర్వ. ఆమె చిత్రాలను ఆన్ లైన్ లో పెట్టి ఆమెకి ఓ వేళా కూడా కట్టారని అపూర్వ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును ఛేదించి, నిందితుడిని గణే ని అదుపులోకి తీసుకున్నారు. ఇక గణేష్ పెట్టిన పోస్టింగ్స్ లో కేవలం హీరోయిన్ల ఫొటోలే కాక కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా ఉండటంతో, అవి ఎవరివన్న కోణంలో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు.

అపూర్వ తనపై ఫిర్యాదు ఇచ్చిన విషయాన్ని గురించి తెలుసుకున్న గణేష్, ‘లొకాంటో’ అనే వెబ్ సైట్ లో తాను పోస్టు చేసిన చిత్రాలు డిలీట్ చేశాడట. ఏమేం పిక్చర్స్ పెట్టాడో రికవరీ చేసే ప్రయత్నం లో పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం తెలిపారు.

హీరోయిన్ల ఫొటోలు చూపించి, విటుల వద్ద ఆన్ లైన్ లో గణేష్ ఏకంగా 2 లక్షల దాకా వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ మాయలోడి బారిన పడిన మిగతావారి వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా విచారిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. గణేష్ మొబైల్ ను సీజ్ చేశామని, అందులోని వివరాలు తమ విచారణకు కీలకమని వెల్లడించాయి.
మరోపక్క అపూర్వ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపి, సినిమా పరిశ్రమ ఈ విషయంపై స్పందించాలని కోరారు.