Home రాజకీయాలు బాబు ఆగ్రహం వెనక భయం ఇదే!

బాబు ఆగ్రహం వెనక భయం ఇదే!

395
SHARE

ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉన్నప్పటికీ… ఏపీలో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి! ఒకవైపు పాదయాత్ర పేరున జగన్ రాజకీయ వాతావరణం వేడెక్కించడం.. జగన్ కు జానాధరణ రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో.. చంద్రబాబు కు కొత్త టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయంట. జగన్ సంగతి ఇలా ఉంటే.. మరోపక్క పవన్ కల్యాన్ రూపంలో చాపకింద నీరులా వ్యతిరేకత పెరిగిపోతుందని మరో టెన్షన్ పట్టుకుందట. ఈ క్రమంలో ఇవి చాలవన్నట్లు పార్టీలో వర్గవిభేదాలు మరో తలనొప్పిగా తయారైన క్రమంలో… ఇవి కూడా చాలవన్నట్లుగా బాబుకు మరో కొత్త టెన్షన్ వచ్చిపడిందట. అదే… గైర్హాజరీలు!!

అవును… ఈ మధ్యకాలంలో బాబు ఏర్పాటు చేస్తున్న టెలీ కాంఫరెన్స్ కు, జిల్లా మీటింగులకు కొంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారు! సరే.. వారికి కూడా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఏదైనా ముఖ్యమైన పని ఉండొచ్చు అని సర్ధుకుందామనుకుంటే… మరో పక్క జగన్ పాదయాత్ర గుర్తుకువస్తుందంట! దీంతో ఉలిక్కి పడుతున్న చంద్రబాబు.. తన మీటింగులకు గైర్హాజరవుతున్న నేతలపై ఫైరవుతున్నారంట. అసలు ఎందుకు హాజరు కాలేకపోయారు, ఏమిటి సమస్య అని అడగడం మానేసిన అధినేత… నిప్పుల వర్షాలు కురిపిస్తున్నారట. దీనికి కారణం… వారు ఫ్యాన్ కిందకి చేరిపోతున్నారేమో అనే భయం అని అంటున్నారు తమ్ముళ్లు!!

దానికి తాజా ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశమైన సమయంలో జరిగింది. మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరైన ఈ సమావేశంలో.. జిల్లా పార్టీ అధ్యక్షుడితో వీడియో కాన్ఫరెన్స్‌ లో నిర్వహించారు చంద్రబాబు. ఈ సమావేశంలో… పలు జిల్లాల్లో నేతల గైర్హాజరు పై బాబు మండిపడుతున్నారట. ఈ సమావేశంలో… గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆంజనేయులు ఏవో కొన్ని పనుల గురించి ప్రస్తావించగా.. ఎంత సేపు అవి చేయండి, ఇవి చేయండని చెప్పడం తప్ప.. నాయకులు కుదురుకోవడం లేదని సీఎం అసహనం వ్యక్తంచేశారట. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ సమావేశానికి రాకపోవడం ఏమిటని తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు.

అయితే… గతంలో ఎప్పుడు చంద్రబాబు సమావేశాలు ఏర్పాటు చేసినా ఒక్కరు కూడా గైర్హాజరయ్యేవారు కాదని చెబుతున్నారు తమ్ముళ్లు. అయితే ఈ మధ్యకాలంలో ప్రత్యక్ష సమావేశాల సంగతి దేవుడెరుగు.. కనీసం వీడియో కాంఫరెన్సు లకు కూడా ఎమెల్యేలు హాజరవడం లేదని చెప్పుకుంటున్నారు. దీంతో వారిది నిర్లక్ష్యం అనుకోవాలా లేక (జగన్ రూపంలో వచ్చిన) మరో ధైర్యం అనుకోవాలో తెలియక బాబు తెగ టెన్షన్ పడిపోతున్నారని అంటున్నారు. దీంతో… ఇప్పటికే బాబుకి ఉన్న టెన్షన్స్ చాలవన్నట్లు.. ఈ గైర్హాజరీల టెన్షన్ కలిసిందని ఫీలవుతున్నారంట తమ్ముళ్లు!!