Home రాజకీయాలు “బాబు చిత్తు చిత్తుగా ఓడిపోవాలి”

“బాబు చిత్తు చిత్తుగా ఓడిపోవాలి”

SHARE

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభ౦ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. కాపు జాతిని అడుగడుగునా మోసం చేస్తూ అవమానిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో చిత్తు చి్త్తుగా ఓడిపోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ౦ అభిలషించారు.

కాపు బిల్లును కేవలం కంటి తుడుపు చర్య లాగా బాబు కేంద్రానికి పంపారని, అందులో ఇసుమంతైనా పనికొచ్చే సమాచారం లేదని కేంద్రం వెనక్కి పంపిందని ముద్రగడ అన్నారు. ఈ విషయం దాచారా లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు.

బిజెపితో తెగతెంపులయ్యాక కాపు బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారంటూ ముద్రగడ మండిపడ్డారు. రాజస్తాన్‌, గుజరాత్‌​, హరియాణాలలో లా కాకుండా ఇంతకూ ముందు ఉన్న రిజర్వేషన్లనే కాపులు కావాలని అడుగుతున్నారని ఈ సందర్భంగా అయన గుర్తుచేశారు.

2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తుగా ఓడించాలని ముద్రగడ అన్నారు. అయితే వచ్చే ఎన్నికలకు ముందు తమ కాపు రిజర్వేషన్లపై ఏ పార్టీ అయితే సృష్టత యిస్తుందో అప్పుడు కాపు జాతితో పాటు ఇతర సామాజిక వర్గాల పెద్దలతో చర్చించి తమ తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు.