Home సినిమా తారక్ కూడా అందులో.. ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన ఎన్టీఆర్‌!

తారక్ కూడా అందులో.. ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన ఎన్టీఆర్‌!

129
SHARE

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ వాడకం బాగా పెరిగింది. దీంతో అభిమానులకు టచ్‌లో ఉండేందుకు సెలబ్రిటీలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిపోతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, మహేష్ బాబు లాంటి స్టార్స్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తెరిచిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పటికే ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రెండ్ ఫాలో అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చేరిపోయారు. ఎన్టీఆర్‌ సినిమాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఇప్పటికే ట్విటర్‌లో ఎన్టీఆర్‌కి రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన కొద్దిసేపటికే 70,000 మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ఇందులో తన మొదటి పోస్ట్‌గా ‘అరవింద సమేత.. వీర రాఘవ’ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు.

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’  సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకులలో మంచి స్పందన వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.