Home రాజకీయాలు జగన్ జోరు అధికార పార్టీ బేజారు

జగన్ జోరు అధికార పార్టీ బేజారు

1157
SHARE

విపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే 2400కిమీ మైలురాయిని కూడా దాటారు జగన్ మోహన్ రెడ్డి. వైకాపా శ్రేణులలో ఆయన రాక ఉత్సాహాన్ని నింపి పార్టీ శ్రేణులు కూడా తరలి వస్తూ యాత్రను విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. జన స్పందన కూడా అనూహ్యమైన రీతిలో ఉండడంతో ఆ మైలేజ్‌ను లేవరేజ్ చేసుకోటానికి వైకాపా అవసరమైన కసరత్తును ప్రారంభించినట్టు౦ది.

రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర లో టీడీపీ పాలనా వైఫల్యాలను జగన్ నిర్విరామంగా ఎండకాడుతూనే ఉన్నారు. ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందని భావిస్తున్న వైకాపా శ్రేణులు పాదయాత్రను సెంటిమెంట్గా కూడా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు.

ఇక జగన్అ పర్యటనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు ఇదంతా టీడీపీ శ్రేణులను విపరీతంగా కలవరపరుస్తోంది. పరిపాలనకే చంద్రబాబు సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తుండడం వల్ల పార్టీ ఇమేజ్ ఏ మాత్రం జగన్ ఇమేజీకి తూగలేకపోతోందనే అభిప్రాయం తెదేపా కేడర్ల లో టెన్షన్ని పెంచుతోంది.

ఇదే ట్రెండు కొనసాగితే ముందుముందు పార్టీకి గడ్డు కాలమే అని తెలుగు తమ్ముళ్ల అంచనా కూడా. ఇక చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారు, కేడర్ లో భయాన్ని అభద్రతా భావాన్ని ఎలా తగ్గించి.. విశ్వాసం పెంచుతారు అనేది చర్చనీయాంశంగా మారింది