Home రాజకీయాలు గోష్పాద క్షేత్రంలో జగన్ పూజలు, గోదావరి హారతి

గోష్పాద క్షేత్రంలో జగన్ పూజలు, గోదావరి హారతి

118
SHARE

విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ప్రసిద్ద క్షేత్రం గోఫ్పాద క్షేత్రం వద్ద పూజలు నిర్వహించారు. గోదావరి నదికి జగన్ హారతి సమర్పించారు.

వేద పండితుల మంత్రాల నడుమ పూజ చేసిన జగన్, గోదావరి తల్లి కి హారతి ఇచ్చి మొక్కుకున్నారు. పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయం వద్ద పూజారులు శివలింగానికి పూజలు,పాలాభిషేకం చేసి ,జగన్ ను ఆశీర్వదించారు.

పూజారులు జగన్ తో గోపూజలు నిర్వహించారు. జగన్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. కాగా జగన్ పాదయాత్ర రాజమండ్రి వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ఈ రోజు ప్రవేశించారు. గోదావరి బ్రిడ్జి పొడుగునా ప్రజలు బారులు తీరి స్వాగతం పలకటం, నదిలో 600 బోటులతో ప్రదర్శన చూపారాలు ఒకింత షాక్ కి గురి చేసాయి.

ఇంతటి ఆదరణ, ప్రేమ ఇంతక మునుపు ఎన్నడూ చూడలేదని ఇక ముందు చూడలేమని జనాలు చెప్పుకుంటాయన్నారు. బహుశా గోదావరి చరిత్ర లో ఇంత జనసంద్రం చూసిందా అంటే డౌటే. వైసీపీ బలం తెదేపా కి నిబ్బరం కోల్పోయేలా చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.