Home రాజకీయాలు ధర్మపోరాట దీక్షల లక్ష్యం చెప్పిన బాబు!

ధర్మపోరాట దీక్షల లక్ష్యం చెప్పిన బాబు!

236
SHARE

ఎవరైనా చంద్రబాబు నాయుడితో… ధర్మపోరాట దీక్షలు ఎందుకు చేస్తున్నారు బాబూ అని అడిగితే… కేంద్రం మోసం చేసింది, హోదా ఇస్తానని ఇవ్వలేదు, విభజనచట్టంలోని హామీలు నరవేర్చలేదు అని! సరే ఈ పాతచింతకాయ పచ్చడి వ్యవహారం ఒకరోజు సరైన మీటింగ్ పెట్టి అటు కేంద్రానికి, ఇటు ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పి, పాలనపై దృష్టిపెడితే బాగుంటుంది కదా అని ఎవరైనా అంటే మాత్రం… అంతెత్తున లేవడానికి సిద్దపడుతున్నారట చంద్రబాబు. పాపం వారికేమి తెలుసు… ఈ ధర్మపోరాట దీక్షలు అనేవి, ప్రజల సొమ్ముతో టీడీపీ చేస్తున్న రాజకీయ ప్రచార కార్యక్రమాలని. ఈ విషయాలను పరోక్షంగా తన నోటితోనే చెప్పుకొచ్చారు చంద్రబాబు!

తాజాగా జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… ఎన్నికల వరకు ధర్మపోరాట దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ… ఈ విషయంలో రాజీ వద్దని, ఎవరు ఏమనుకున్నా, ఎంత ఖర్చైనా.. ఈ దీక్షలు ప్రతీ గ్రామంలోనూ ఏర్పాటు చేసి, తన ప్రసంగాలు నిత్యం లైవ్ లో వినిపించాలని కోరుతున్నారట. అంతే కాకుండా.. సాధికార మిత్రలతో, రైతు మిత్రలతో, విద్యార్థులతో రెగ్యులర్ గా సభలు పెట్టాలని, కార్యకర్తలు ఈ విషయంలో ముందుకు రావాలని పిలుపునిస్తున్నారట. గ్రామదర్శిని పేరు చెప్పి… టీడీపీ కార్యకర్తలు, నేతలు అంతా అధికారులను వెంటపెట్టుకుని గ్రామాల్లో తిరిగి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచిస్తున్నారు.

ఇదే క్రమంలో… ప్రభుత్వం చేసిన పనులపై ప్రచారం విస్తృతంగా ఉండాలని చంద్రబాబు సూచించారట. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, మౌత్ ప్రచారంతో ముందుకుసాగాలని, ప్రభుత్వం చేసే ప్రతిపనిని, కేంద్రం చేసిన మోసాన్ని ఈ ధర్మపోరాట దీక్షల వేదికలపై చెప్పాలని బాబు సూచిస్తున్నారట. అంటే… ధర్మపోరాట దీక్ష అనేది.. టీడీపీ ప్రచార కార్యక్రమమని, రాబోయే ఎన్నికలకు ప్రజాసొమ్ముతో ఇప్పటినుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టామని చంద్రబాబు చెప్పకనే చెప్పారన్న మాట.

ఈ లెక్కన చూసుకుంటే… రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అనే బాద పక్కకు పోయి.. తాను అంత చేశాను ఇంత చేశాను అని చెప్పుకునే క్రమంలో… బీజేపీ మోసం చేసింది అనే చాటున తన అస్మర్ధతను కవర్ చేసే పనికి పూనుకున్నారన్నమాట చంద్రబాబు. ఇదే క్రమంలో.. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ ఖజానాకు గండె కొట్టి… పార్టీ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారన్నమాట!! ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు గారూ!!