Home రాజకీయాలు ముఖ్యమంత్రి బాబు మోసం చేసినా…మోడీ వ్యాఖ్య

ముఖ్యమంత్రి బాబు మోసం చేసినా…మోడీ వ్యాఖ్య

100
SHARE

ఆంధ్ర ప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. కన్నాతో పాటు సీనియర్ భాజపా నాయకులు కూడా మోడీ తో భేటీ అయ్యారు. కన్నా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఇదే మొదటిసారి ప్రధాన మంత్రి మోడీ తో భేటీ కావటం.

అందువల్ల ఈ మీటింగ్ కి ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ తర్వాత ప్రజలకు మోడీ ఏ౦ చెప్పమ్ననారో కన్నా వివరించారు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేసినా, కేంద్రం మాత్రం రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉ౦దని ప్రజలకు చెప్పాలని మోడీ సూచించారని పేర్కొన్నారు. ఎన్ డీ ఏ ప్రభుత్వం 85% శాతం హామీలను నెరవేర్చిందని ఏపి ప్రజల వెంట తాను ఉంటానని మోడీ చెప్పమన్నారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి ఒనగూరుస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలని కూడా మోడీ చెప్పారన్నారు.

ఇక జూన్‌ 20 నుంచి తాము ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కరపత్రాల ద్వారా ఏపీ కి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలోని వివిధ పథకాలకు నిధులు, గ్రాంటులు కేంద్రం ఏ విధంగా కేంద్రం ఇచ్చిందో ప్రజలకు తెలపట౦ తమ బాధ్యత అన్నారు. పోలవరంపై ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడ కేంద్రం ఇచ్చిందే అని కన్నా తెలిపారు.