Home రాజకీయాలు వంతెన కాదు.. చంద్రబాబు షేక్ అయ్యారు!

వంతెన కాదు.. చంద్రబాబు షేక్ అయ్యారు!

1000
SHARE

పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర.. తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. జగన్ రాక నేపథ్యంలో తూర్పుగోదావరి ప్రజలు వైకాపా అధినేత జగన్ కు బ్రహ్మరథం పట్టారు. (ఘన స్వాగతం, బ్రహ్మరథం కంటే పెద్ద పదాలు తెలియని కారణంగా అవే వాడాల్సి వచ్చింది). ఇది అంతకు మించిన స్వాగతం.. ఒక్క మాటలో చెప్పాలంటే… జగన్ పాదయాత్ర లో ఇది ఒక చారిత్రక ఘట్టం!

వైఎస్‌ జగన్‌ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జికి చేరుకుని జిల్లాలోకి ప్రవేశించగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తమ అభిమానాన్ని చూపించుకోవడానికి వారు పడిన తపన, చేసిన వినూత్న స్వాగతాలు అద్భుతః! ఈ సందర్భంగా ఈ యాత్రకు ముందు బాబు ప్రభుత్వం జగన్ కు ఆటంకం కలిగించడానికి పెట్టుకున్న ఒక వంక… వంతెనకు ప్రమాదం అని! ఇప్పుడు ఆ వంతెన పేరు చెప్పి చంద్రబాబుపై ఆన్ లైన్ వేదికగా సెటరిర్ల వర్షాలు పడుతున్నాయి!

తూర్పుగోదావరిలోకి జగన్ ఎంటరవుతున్నారనగానే పాదయాత్రకు పోలీసులు వంతెన మీదుగా అనుమతి ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. అది పాతకాలం వంతెన కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు వస్తే కూలిపోయే ప్రమాదం ఉందని, వంతెనకు పక్కన సరైన రక్షణ లేదని.. ఇలా రకరకాల కారణాలు చెప్పారు. ప్రజాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ.. ఆఖరికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా మద్దతు దారులను వెనక్కు పంపించడం, ముళ్లకంచెలు అడ్డువేయడం వంటి పనులు కూడా చేశారు! అయినా కూడా జనం వెనక్కి తగ్గలేదు!

అయితే.. పాదయాత్ర అంతా అనుకున్నట్లుగానే రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా.. ప్రత్యర్ధుల కళ్లు కుట్టే స్థాయిలో రాజమండ్రికి చేరుకుంది. పోలీసులు, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు కానీ, మరెలాంటి ప్రమాధాలు కానీ జరగలేదు. దీంతో… జగన్ కు స్వాగతం చెప్పడానికి వచ్చిన ప్రజలతో రాజమండ్రి వంతెన షేక్ అయ్యిందో లేదో కానీ… వచ్చిన జానాలను చూసి చంద్రబాబు మాత్రం షేక్ అవుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు గోదావరి జిల్లా నాయకులు. రాజమండ్రి వంతెన మీదకు ప్రజలు ఎక్కువగా వస్తే.. అది కూలిపోతుందని ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని.. జనం ఎక్కువస్తే కూలిపోవడానికి ఇది చంద్రబాబు కట్టిన వంతెన కాదని సెటైర్లు పడుతున్నాయి! ఏది ఏమైనా… తూర్పుగోదావరి ఎంట్రన్స్, జనాల స్పందన.. ఇవన్నీ చూశాక.. బాబుకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని అంటున్నారు జనాలు!!