Home రాజకీయాలు చారిత్రక ఘట్టం… రెండు కళ్లూ చాలవు!

చారిత్రక ఘట్టం… రెండు కళ్లూ చాలవు!

486
SHARE

వైకాపా అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్ కం రైల్ బ్రిడ్జి మీదుగా తూర్పు గోదావరిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన స్వాగత ఏర్పాట్లు.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ సందర్భంగా కొవ్వూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రం చేరుకున్న జగన్…. గోదారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ కు షోష్పాద క్షేత్రం వేద పండితులు సంప్రదాయ స్వాగతం పలికారు. వారు వేద మంత్రాలు చదువుతుండగా…..గోదారమ్మకు జగన్ హారతినిచ్చారు. ఆ తర్వాత ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న జగన్ ప్రత్యేక పూజలు చేశారు.

జగన్.. తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న చీరలను ధరించిన 150 మంది మహిళలు.. జగన్ కు 150 గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతిచ్చి జిల్లాలోకి ఘన స్వాగతం పలికారు. జగన్ బ్రిడ్జిపై నడుస్తున్న సమయంలో గోదావరిలో వైకాపా జెండాలతో అలంకరించిన 600 పడవలు పాదయాత్రను అనుసరిస్తుండగా… బ్రిడ్జి మొత్తం పార్టీ జెండాల ఎయిర్ బెలూన్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదే సమయంలో బ్రిడ్జి రెయిలింగ్ పై 7 అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల పొడవైన వైకాపా జెండా అందరినీ ఆకట్టుకుంటోంది. వంతెనపై జగన్ నడుస్తుండగా… అభిమానులతో బ్రిడ్జి మొత్తం నిండిపోగా.. జగన్ అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా… ప్రత్యర్ధులు మాత్రం కన్నీరు పర్యంతమవుతున్నారు అని చెప్పుకున్నా అతిశయోక్తి కాదేమో!

కాగా… ఇది ఖచ్చితంగా చారిత్రక ఘట్టమే! 2013 – జూన్ 4న వైఎస్ చేపట్టిన “ప్రజా ప్రస్థానం” యాత్ర ఇదే వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించగా.. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ షర్మిల చేపట్టిన “మరో ప్రజా ప్రస్థానం” యాత్ర కూడా జూన్ 4న ఈ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా తు.గో. జిల్లాలోకి ప్రవేశించింది. తాజాగా 2018 లో జగన్ ఇదే వంతెనపై నుంచి నడుస్తూ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించి చారిత్రక ఘట్టానికి నాంది పలికారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నేతలు ఇలా అకుంఠిత దీక్షతో, ప్రజాశ్రేయస్సుకోరి, ప్రజల సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించడంకోసం చేపట్టిన పాదయాత్రలు తమ జిల్లాలోకి ప్రవేశించడంపై తూర్పు గోదావరి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.