Home రాజకీయాలు కాంగ్రెస్ మిత్రపక్షంగా టీడీపీ… రేపు తేలిపోతుంది!

కాంగ్రెస్ మిత్రపక్షంగా టీడీపీ… రేపు తేలిపోతుంది!

678
SHARE

ప్రస్తుతం చంద్రబాబు ఉన్న పరిస్థితుల్లో తనకున్న వ్యక్తిగత సమస్యలనుంచి గట్టెక్కాలంటే… కచ్చితంగా కేంద్రంలోని ఒక బలమైన పార్టీతో (అది అనైతికం అయినా సరే) పొత్తు పెట్టుకోవాలాని ఉవ్విల్లూరుతున్న పరిస్థితి. ఈ క్రమంలో బాబుకు కాంగ్రెస్ తప్ప మరో గత్యంతరం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు కూడా ఏపీలో శూన్యం మిగలడంతో… వారు కూడా బాబుని దగ్గర చేసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ లెక్కన బాబు మరోసారి మోసపోవడానికి సిద్దంగా ఉన్నారా అనే కామెంట్స్ సంగతి కాసేపు పక్కనపెడితె… ఆ బందం మరింత బలపడింది అనడానికి తాజా ఉదాహరణ వెలుగులోకి వచ్చింది.

మొన్న కర్ణాటకలో రాహుల్ – సోనియాతో వేదిక పంచుకున్న చంద్రబాబును మరింత దగ్గరచేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉండగా… జాతీయ స్థాయిలో తనకు కాంగ్రెస్ అండ లేకుంటే ఇబ్బందులు తప్పవని భావించిదగ్గరవుతున్న బాబుకు… ఇఫ్తార్ విందుకు ఆహ్వానం అందింది. అవును… తాజాగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే ఇఫార్ విందుకు… ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, లాలు ప్రసాద్ యాదవ్ లతో పాటు చంద్రబాబు నాయుడుకు కూడా రాహుల్ గాంధీ ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది.

కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు నిరసనగా, తెలుగు వాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి తన అవసరం కోసం టీడీపీని తాకట్టుపెట్టే దిశగా సాగుతున్న పరిస్థితులు తమ్ముళ్లకు నచ్చినా నచ్చకున్నా, జనాలు ఏమనుకున్నా సరే… స్నేహం చేయాలని బాబు బావిస్తున్నారు అని స్పష్టం అవుతుంది. ఏది ఏమైనా… రేపు కాంగ్రెస్ పార్టీ పిలిచిన ఆహ్వానం మేరకు బాబు ఢిల్లీకి వెళతాడా? లేదా? అన్న విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ విషయంపై రేపు తేలిపోతే… 2019లో బాబు రాజకీయం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!