Home రాజకీయాలు పోలీసుల మాటున దాక్కున్న టీడీపీ!

పోలీసుల మాటున దాక్కున్న టీడీపీ!

SHARE

రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని టీడీపీ ఆరోపిస్తున్న తరుణంలో… రాష్ట్రానికి బీజేపీ చేయాల్సిందంతా చేసింది, కానీ చంద్రబాబు ప్రభుత్వమే అవినీతిలో కూరుకుపోయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుబారా చేస్తూ, ప్రజలపై భారం మోపుతూ కాంట్రాక్టర్లను పోషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక టీవీ ఛానల్ చర్చా కార్క్రమంలో పాల్గొన్న ఈ రెండు పార్టీల నేతలమధ్య మాటల యుద్దం కాస్త… సవాల్లుగా మారడంతో.. అనేక రాజకీయ పరిణామాల మధ్య.. టీడీపీ పలాయన వాదం వెలుగులోకి వచ్చింది.

ఎవరు అవునాన్నా కాదన్నా… కచ్చితంగా పోలీసులు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతల మాటకు విలువ ఇస్తారు అనేది ఒప్పుకు తీరాల్సిన విషయం! పైగా ప్రస్తుతం ఏపీలో బాబు రాజకీయం మొత్తం పోలీసుల చాటునే చేస్తున్నారనే విమర్శలు కూడా తాజాగా బీజేపీ నేతలు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో బీజేపీ తరుపున మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి… అర్భన్ హౌసింగ్ ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయని.. కేంద్రం ఇచ్చే లక్షన్నరకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయలు కాకుండా.. పేదల దగ్గర బ్యాంకులో రుణాలు ఇప్పించి, డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ విషయాన్ని తాను రుజువు చేస్తానని, అందుకు టీడీపీ తరుపున చర్చలో పాల్గొన్న బాబూ రాజేంద్ర ప్రసాద్.. అనంతపురం రానవసరం లేదు, తానే ఉయ్యూరు కు వస్తున్నాయని సవాల్ విసిరారు!

దీంతో ఆ సాయంత్రం టీవీల ముందు హడావిడి చేసిన బాబు రాజేంద్ర ప్రసాద్… ఈ రోజు ఉదయం ఉయ్యూరులో నిర్మాణం జరుగుతున్న ఇళ్లవద్ద రెండు నుంచి మూడువందల మంది కార్యకర్తలను వేసుకుని, పచ్చ జెండాలు చేతపట్టి ఉన్నారు. అయితే.. ఈ సమయంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి… మరో ఇద్దరు నాయకులు మాత్రం ఒకే ఒక కారులో బయలుదేరగా… “శాంతిభద్రతల” కారణం అని చెప్పి వారిని అరెస్టు చేశారు పోలీసులు. దీనిపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తాయి.

ముగ్గురు వ్యక్తులు.. కారులో ప్రయాణించినంత మాత్రాన్న.. ఒక ఎమ్మెల్సీని తన ఊరిలో కలుసుకున్నంత మాత్రాన్న జరిగే శాంతిభద్రతల సమస్య ఏమిటో చెప్పాలని విష్ణు డిమాండ్ చేశారు. అనంతరం విష్ణును… కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ విషయాన్ని బాబూ రాజేంద్ర ప్రసాద్ కు తెలిపిన సదరు మీడియా… ఆయనపై ఒత్తిడి తెచ్చి… పోలీసులతో మాట్లాడి.. తనను కూడా స్టేషన్ కు వెళ్లి చర్చించాలని కోరింది. అనంతరం గుటకలు మింగిన బాబూ రాజెంద్ర ప్రసాద్… అందుకు సరే సరే అంటూ అంగీకరించారు. ఇంతలోనే బాబూ రాజేంద్ర ప్రసాద్ కంకిపాడు స్టేషన్ కు వెళ్తున్నారనే సమాచారం ఎవరిచ్చారో తెలియదు కానీ… ఆ స్టేషన్ నుంచి విష్ణు ను పోలీసులు మరో స్టేషన్ కు తరలించారు.

ఈ విషయాలపై స్పందించిన విష్ణు… టీవీల ముందు మాత్రం తాను స్టేషన్ కు వెళ్తున్నానని చెబుతున్న రాజేంద్ర ప్రసాద్… వెనక నుంచి పోలీసులకు ఫోన్ చేసి, విష్ణు ను వేరే స్టేషన్ కి తరలించమని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. విష్ణు ఆరోపించినట్లుగానే కథమొత్తం జరుగుతూ వచ్చింది. దీంతో… పోలీసుల మాటున దాక్కుని టీడీపీ పారిపోయిందని… ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లయ్యిందని విష్ణు తేల్చి చెప్పేశారు!!

అసలు టీడీపీ నేతలు.. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇంత హడావిడి చేయవలసిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్సీ అనుకుంటే… నిజంగా తనవద్ద సత్తా ఉంటే.. తన వాదనలో నిజముంటే… విష్ణును స్వయంగా పోలీసుల సాయంతోనే తన ఊరికి రప్పించుకుని, ప్రశాంతమైన వాతావరణంలో చర్చలు జరపొచ్చు. అలా కాకుండా మీడియా ముందు ఒకమాట.. వెనక పోలీసులతో మరో మాట చెప్పిస్తూ.. తప్పించుకు తిరిగే పనికి పూనుకున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు వర్గాల వైపూ వందల సంఖ్యలో కార్యకర్తలు ఉంటే… శాంతి భద్రతల సమస్య లేవనెత్తొచ్చు కానీ… ఒకవైపునే వందమంది ఉండి, మరో వైపు ఇద్దరే ఉన్నప్పుడు, అది కూడా పోలీసుల సమక్షంలో, మీడియా ముందు జరుగుతున్నప్పుడు వచ్చే సమస్యలేమిటో పోలీసులే చెప్పాలి, వారిని నడిపించిన బాబూ రాజేంద్ర ప్రసాదే చెప్పాలని అంటున్నారు జనాలు! చివరాకరున.. నేరం పోలీసులది అని బాబూ రాజేంద్ర ప్రసాద్ చెప్ప ఫిక్సయ్యారని అంటున్నారు!!