Home రాజకీయాలు 2014లో లేని ఈవీఎం ల పై డౌట్ ఇప్పుడెందుకు బాబూ

2014లో లేని ఈవీఎం ల పై డౌట్ ఇప్పుడెందుకు బాబూ

109
SHARE

గత ఎన్నికలలో ఇవే ఇవిఎమ్ ల ఆదారంగా అద్భుత విజయం సాదించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ ఇవే ఇవిఎమ్ లపై పలు సందేహాలు వస్తున్నాయి.

ఇవిఎమ్ లు దుర్వినియోగానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తెదేపా క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని నాయుడు పిలుపునిచ్చారు.

ఇటీవల తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో బాబు మాట్లాడుతున్నప్పుడు ఆర్దిక మంత్రి యనమల రామకృస్ణుడు చేసిన ఓ వ్యాఖ్యపై స్పందిస్తూ ఇవిఎమ్ లను దుర్వినియోగం చేయవచ్చని, అసలు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువును అయినా దుర్వినియోగం చేయవచ్చని , అందువల్ల కార్యకర్తలు చాలా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అబి్ప్రాయపడ్డారు.

అంతేకాదు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాన్ని సీరియస్‌గా ఆలోచించాలని కూడా నేతలకు సూచించారు. నిజంగానే ఈవీఎం లు టా౦పర్ చేయగలిగితే ఇన్నాళ్లు తెలీలేదా బాబు? సరిగ్గ్గా ఎన్డీఏ నించి బయటకొచ్చాక మాత్రమే అర్థమైందా….ఊర్కో రాజా!!