Home ట్రైలర్స్ ‘విశ్వరూపం 2’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

‘విశ్వరూపం 2’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

SHARE

కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం 2’ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. హిందీలో అమీర్ ఖాన్, తమిళంలో శృతి హాసన్ ఈ ట్రైలర్స్ రిలీజ్ చేశారు. 2013లో వచ్చిన ‘విశ్వరూపం’ చిత్రానికి ఇది సీక్వెల్. ట్రైలర్ ఆకట్టునే విధంగా ఉంది. కమల్ హాసన్ మరోసారి తన అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడని స్పష్టం అవుతోంది. మతానికి కట్టుబడటం తప్పు కాదు… దేశ ద్రోహం తప్పు బ్రదర్ అంటూ కమల్ హాసన్ చెప్పే డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

‘విశ్వరూపం 2′ చిత్రాన్ని కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించారు. విశ్వరూపం 2 హిందీ ట్రైలర్ విడుదల చేసిన అమీర్ ఖాన్…. ‘కమల్ సర్, మీకు మీ చిత్ర బృందానికి కంగ్రాట్స్. మీ చిత్రం మంచి విజయం అందుకోవాలి. మీ పట్ల ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. విశ్వరూపం 2 తమిళ వెర్షన్ ట్రైలర్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ విడుదల చేశారు.